Share News

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

ABN , Publish Date - May 13 , 2026 | 06:42 AM

హైదరబాద్‌- బెళగావి(కర్ణాటక) మార్గంలో ఆరు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు
New Express Trains

హైదరాబాద్‌ సిటీ: హైదరబాద్‌- బెళగావి(కర్ణాటక) మార్గంలో ఆరు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. గతంలో ప్రత్యేక రైళ్లుగా ఉన్న వీటిని ఈ నెల 15నుంచి రెగ్యులర్‌ ఎక్స్‌ప్రె్‌సలుగా మార్చుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి బెళగావి - హైదరాబాద్‌ (17072) మధ్య ప్రతి శుక్రవారం, 20వ తేదీ నుంచి హైదరాబాద్‌- బెళగావి (17071) మధ్య ప్రతి గురువారం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు బయల్దేరనున్నాయి. ఈ నెల 16నుంచి ప్రతి శనివారం చర్లపల్లి-బెళగావి (17075) మధ్య, 17నుంచి ప్రతి ఆదివారం బెళగావి-చర్లపల్లి (17076 మధ్య ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడవనున్నాయి.


city1.2.jpgమరోవైపు ఈ నెల 18నుంచి ప్రతి సోమవారం సికింద్రాబాద్‌- బెళగావి (17073) మధ్య, 19నుంచి ప్రతి మంగళవారం బెళగావి-సికింద్రాబాద్‌ (17074) మధ్య ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు బేగంపేట్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూర్‌, యాద్గిర్‌, కృష్ణా, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోని, గుంతకల్‌, బళ్లారి, దారోజి, తొరనగళ్లు, హోస్పేట్‌, గదగ్‌, హుబ్లీ, ధార్వాడ్‌, లోండా, ఖానాపూర్‌ స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


city1.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

ఏపీలో స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ స్పెషల్ ఫోకస్

అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు: అనిత

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 06:53 AM