Share News

అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు: అనిత

ABN , Publish Date - May 13 , 2026 | 05:33 AM

రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హోం మంత్రి వంగలపూడి అనిత సంబంధిత అధికారులను ఆదేశించారు.

అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు: అనిత

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హోం మంత్రి వంగలపూడి అనిత సంబంధిత అధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌తో కలసి ఆమె అగ్నిమాపక శాఖపై సమీక్షించారు. సింగపూర్‌ పర్యటనలో ఆమె తెలుసుకున్న అక్కడి విపత్తు నిర్వహణ విధానాలను మన అగ్నిమాపక శాఖ అధికారులకు వివరించారు. కాగా, జైళ్లలో ఖైదీలకు మానసిక వైద్య సహాయం అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆ శాఖ అధికారులను మంత్రి అనిత ఆదేశించారు. ఆమె జైళ్ల శాఖపై సమీక్షించారు

Updated Date - May 13 , 2026 | 05:33 AM