కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్.. అసలు విషయమిదే..
ABN , Publish Date - May 15 , 2026 | 05:41 PM
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్‌లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్‌లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కుమారుడు భగీరథ్ పోక్సో కేసుతో పాటు తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడొద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరుతో ఇప్పటివరకు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో ఉన్న వీడియోలను తొలగించాలని కోర్టును బండి సంజయ్ కోరారు.
తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రచారం జరుగుతోందని న్యాయస్థానానికి బండి సంజయ్ వివరించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియాలో బండి సంజయ్‌పై వచ్చిన కథనాలను వెంటనే తొలగించాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాల వరకు ఎలాంటి కథనాలు ప్రసారం చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. యూట్యూబ్, సోషల్ మీడియాలో బండి సంజయ్‌కి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను వెంటనే తొలగించాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు
Read Latest Telangana News And AP News And International News And Telugu News