ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు
ABN , Publish Date - Oct 06 , 2026 | 03:25 PM
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపుల కేసులో అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపుల కేసులో అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 67 రోజులపాటు జైల్లో ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నారు. న్యాయస్థానం ఈ రోజు (మంగళవారం) అతడికి బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. జాతీయ పోలీసు అకాడమీలో వేధింపులకు పాల్పడ్డారని మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జులై 18వ తేదీన అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ తర్వాత న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అప్పటినుంచి ఉదయ్ కృష్ణారెడ్డి చర్లపల్లి జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఈరోజు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో అతను విడుదలయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు
తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్
రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News