విద్యా రంగంలో సంస్కరణల జోరు.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సమూల మార్పులు
ABN , Publish Date - Apr 22 , 2026 | 06:07 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. అక్షరాస్యత పెంపు నుంచి బోధనా నాణ్యత వరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలంగాణ విద్యా వ్యవస్థలో కొత్త విప్లవానికి నాంది పలికాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. అక్షరాస్యత పెంపు నుంచి బోధనా నాణ్యత వరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలంగాణ విద్యా వ్యవస్థలో కొత్త విప్లవానికి నాంది పలికాయి.
వందశాతం అక్షరాస్యత లక్ష్యంగా ‘వయోజన విద్య’
గతంలో నిర్లక్ష్యానికి గురైన వయోజన విద్యకు రేవంత్‌రెడ్డి సర్కార్ కొత్త ఊపిరి పోసింది. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని వందకు వందశాతం పెంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకు సాగుతోంది. తాజాగా నిర్వహించిన అక్షరాస్యత పరీక్షలకు ఏకంగా 6.31 లక్షల మంది వయోజనులు హాజరుకావడం ఒక రికార్డు. పెద్దల చదువుకు పెద్దపీట వేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
బోధనా నాణ్యతలో విప్లవాత్మక మార్పులు
విద్యార్థులకు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, అవి వారికి ఎంతవరకు అర్థమవుతున్నాయనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెద్దపల్లి జిల్లాలోని 61 పాఠశాలల్లో ‘అకడమిక్ ఇన్‌స్పెక్షన్ టీమ్స్’ ద్వారా ప్రత్యేక బోధనా పద్ధతులను అమలు చేశారు. కేవలం ఆరునెలల్లోనే బోధన నాణ్యతలో గణనీయమైన మార్పులు వచ్చాయి. బోధన వ్యూహాలు 48శాతం నుంచి 68శాతానికి మెరుగయ్యాయి. తరగతి గదుల నిర్వహణ, విద్యా వనరుల వినియోగంలో ఉపాధ్యాయులు స్పష్టమైన పురోగతి సాధించారు.
ప్రాథమిక విద్యపై ప్రత్యేక ఫోకస్
పునాది విద్య గట్టిగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని భావించిన ప్రభుత్వం, ప్రాథమిక స్థాయిలో అభ్యాస నైపుణ్యాలను పెంచింది. తెలుగులో 35శాతం, ఇంగ్లీష్‌లో 29శాతం, ఉర్దూలో 40శాతం అభ్యాస వృద్ధి నమోదైంది. విద్యార్థుల గణిత నైపుణ్యాల్లో 30శాతం వరకు పెరుగుదల కనిపించింది.
నిధుల వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్
కేంద్రం ప్రభుత్వం అందించే సమగ్ర శిక్ష నిధులను వినియోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 84శాతం నిధులను విద్యారంగం కోసం ఖర్చు చేసింది. విద్య కోసం కేటాయించిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తూ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెరుగైన వసతులు కల్పిస్తోంది. రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మిస్తుందనే నినాదంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తోంది. అక్షరాస్యతలో అగ్రస్థానం, నాణ్యమైన బోధన, నిధుల పారదర్శక వినియోగంతో తెలంగాణ విద్యా రంగం నేడు దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
Read Latest Telangana News And AP News And International News And Telugu News