Share News

ఖైదీలకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాలి: డీజీ స్వాతి లక్రా

ABN , Publish Date - Nov 23 , 2026 | 08:57 PM

ఖైదీలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ స్వాతి లక్రా సూచించారు.

ఖైదీలకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాలి: డీజీ స్వాతి లక్రా
Swati Lakra

హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఖైదీలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ స్వాతి లక్రా (Swati Lakra) సూచించారు. ఈరోజు (సోమవారం) మహిళా ప్రత్యేక కారాగారం, చంచల్‌గూడ కేంద్ర కారాగారాన్ని స్వాతి లక్రా తనిఖీ చేశారు. జైళ్ల నిర్వహణ, ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, సిబ్బంది సంక్షేమంపై సమీక్షించారు. అలాగే, మహిళా జైల్లో ఖైదీల బ్యారక్‌లను, ఆస్పత్రి, వంటశాల, కౌన్సెలింగ్ గది, వర్క్‌షాప్‌‌లను పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న వైద్యసేవలు, మందుల లభ్యతపై వైద్యాధికారితో మాట్లాడారు. ఖైదీలకు అందిస్తున్న న్యాయ సహాయం, న్యాయ సేవలపై అధికారులతో సమీక్షించారు. ఖైదీల రిజిస్టర్లు, స్టాక్ రికార్డులు, ఈ-ప్రిజన్స్ పోర్టల్ పనితీరును పరిశీలించారు.


చంచల్‌గూడ జైల్లో పారిశ్రామిక, వృత్తి శిక్షణ విభాగాలను తనిఖీ చేశారు. ఇనుము పరిశ్రమ, కలప ఉత్పత్తులు, పేపర్ బ్యాగుల తయారీ, ప్రింటింగ్ యూనిట్లను పరిశీలించారు. ఆయా వస్తువుల తయారీ పనుల్లో ఖైదీలు పాల్గొంటున్న తీరును స్వయంగా పరిశీలించి వారితో డీజీ స్వాతి లక్రా మాట్లాడారు. ఖైదీలు విడుదలయ్యాక సమాజంలో గౌరవంగా జీవించేలా పునరావాస కార్యక్రమాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. జైళ్లల్లో పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు డీజీ స్వాతి లక్రా సూచనలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 09:22 PM