కాంగ్రెస్‌లో ప్రోటోకాల్ పంచాయితీ.. రంగంలోకి దిగిన సందీప్
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:10 PM
తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పంచాయితీ గాంధీభవన్‌కు చేరింది. ఇద్దరిని గాంధీభవన్‌కు పిలిచి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి సందీప్ మాట్లాడారు.
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy), మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పంచాయితీ గాంధీభవన్‌కు చేరింది. ఇద్దరిని గాంధీభవన్‌కు పిలిచి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి సందీప్ మాట్లాడారు. ఈ వివాదంపై మంత్రి వివేక్ వివరణ ఇచ్చారు. అలాగే, గాంధీభవన్‌కు పెద్దపల్లి ఎంపీ వంశీ కూడా చేరుకున్నారు. ప్రోటోకాల్ పంచాయితీతో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీల మధ్య వర్గపోరు నడుస్తోన్నట్లు సమాచారం. పెద్దపల్లి పార్లమెంట్ పరిధి సమస్యను పరిష్కరించే పనిలో సందీప్ దృష్టి సారించారు.
నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు..

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీల మధ్య సమస్య ఉందని తెలిపారు. తనకు ఎవరితో సమస్య లేదని స్పష్టం చేశారు. తాను స్ట్రాంగ్ అవుతానని, పెద్దపల్లిలో పార్టీని బలపరుస్తానని అన్నారు. తాను పార్టీ మారుతానని చెప్పే వాళ్లకు బుద్ది ఉండాలని ధ్వజమెత్తారు. తనపై అసూయ పడితే ఇంకా స్ట్రాంగ్ అవుతానని స్పష్టం చేశారు. తాను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదని తెలిపారు. లేబర్ మంత్రిగా తెలంగాణలో గిగ్ వర్కర్క్స్‌కు అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకువచ్చానని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట సభ సక్సెస్ చేశానని మంత్రి వివేక్ వెంకట్ స్వామి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఖేలో ఇండియా గేమ్స్.. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: సీఎం రేవంత్‌రెడ్డి
టెక్నాలజీతో పోలీస్ సేవలు మరింత వేగవంతం: డీజీపీ
నాగర్ కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వరాలు.. రూ.450 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News