కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం శరవేగంగా చర్యలు: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Apr 12 , 2026 | 06:18 PM
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలని ఎన్డీఎస్‌ఏ అధికారులు గుర్తించారని తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై తమ ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) తెలంగాణ సచివాలయంలో కాళేశ్వరం బ్యారేజీలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలను ఎన్డీఎస్‌ఏ అధికారులు గుర్తించారని తెలిపారు. 2027 నుంచి 2028 వరకు బ్యారేజీల పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని అన్నారు. AFRY ఇండియా – IIT ముంబైకి డిజైన్ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. CWPRSకు అత్యున్నత ప్రాధాన్యమని.. 45 రోజుల పరీక్షలు ఉంటాయని తెలిపారు. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని.. వారానికి రెండుసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎల్ అండ్ టీ సహ సంస్థలకు క్యాంపులు రీ యాక్టివేట్ చేయాలని ఆదేశించారు. అన్ని పరీక్షలు సంయుక్తంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుపై పీకో టెక్నాలజీ ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు
పూలే స్పూర్తికి భిన్నంగా కాంగ్రెస్ పాలన: బండి సంజయ్
Read Latest Telangana News And AP News And International News And Telugu News