రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా మంత్రి తుమ్మల నయా ప్రతిపాదన
ABN , Publish Date - Nov 22 , 2026 | 05:10 PM
ఆయిల్‌పామ్ రైతులకు విద్యుత్ లైన్ల సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రతిపాదన చేశారు. బహిరంగ విద్యుత్ తీగల స్థానంలో ఏబీ కేబుల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ రైతులకు విద్యుత్ లైన్ల సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Telangana Minister Tummala Nageswara Rao) కీలక ప్రతిపాదన చేశారు. బహిరంగ విద్యుత్ తీగల స్థానంలో ఏబీ కేబుల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఈరోజు (ఆదివారం) మంత్రి తుమ్మల ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ లైన్ల కారణంగా ఆయిల్‌పామ్ తోటల్లో మొక్కల సంఖ్య తగ్గుతోందని తెలిపారు. దీనివల్ల ఎకరాకు 6 నుంచి 8 మొక్కలు నాటే అవకాశాన్ని అన్నదాతలు కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు.
35 ఏళ్లలో రూ.27.45 లక్షల స్థూల ఆదాయం..
ఏబీ కేబుల్స్ ఏర్పాటుతో సాగు భూమిని పూర్తిస్థాయిలో వినియోగించడానికి అవకాశం ఉంటుందని మంత్రి తుమ్మల వివరించారు. నిర్మల్ జిల్లా కనకాపూర్‌లో క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ సమస్య వెలుగులోకి వచ్చిందని అన్నారు. 20 ఆయిల్‌పామ్ మొక్కల ద్వారా 35 ఏళ్లలో రూ.27.45 లక్షల స్థూల ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు. విద్యుత్ లైన్‌ను ఏబీ కేబుల్‌గా మార్చేందుకు అయ్యే ఖర్చు కేవలం రూ.1.45 లక్షలని తెలిపారు. ఏబీ కేబుల్స్‌తో విద్యుత్ షార్ట్సర్క్యూట్లు, అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని అన్నారు.
రైతులకు అదనపు ఆదాయం..
అన్నదాతలపై భారం పడకుండా సబ్సిడీ లేదా ఛార్జీల మినహాయింపునకు ప్రతిపాదన చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. డిస్కంల స్టోర్ల ద్వారా నాణ్యమైన ఏబీ కేబుల్స్‌ను సరఫరా చేయాలని సూచించారు. విద్యుత్, ఉద్యాన శాఖల సమన్వయంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ లైన్లను గుర్తిస్తున్నామని తెలిపారు. దీనివల్ల ఆయిల్‌పామ్ రైతులకు అదనపు ఆదాయం వస్తుందని వివరించారు. వ్యవసాయ కార్మికులకు మెరుగైన భద్రతే తమ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News