మంత్రి శ్రీధర్‌బాబుతో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ భేటీ
ABN , Publish Date - Sep 06 , 2026 | 06:54 PM
తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబుతో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ ఆదివారం రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబుతో (Telangana Minister Sridhar Babu) నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ ఈరోజు (ఆదివారం) రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ‘తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్’పై ప్రధానంగా మాట్లాడారు. సిలికాన్ ఫోటోనిక్స్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక రోడ్‌మ్యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్–2.0తో అనుసంధానంపై చర్చించారు. పరిశోధన నుంచి వాణిజ్య తయారీ వరకు సమగ్ర ఎకోసిస్టమ్‌పై దృష్టి సారించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
డిజైన్, రీసెర్చ్, తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్‌పై వ్యూహం రచిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. అధునాతన ఫోటోనిక్ ప్యాకేజింగ్, కో-ప్యాకేజ్డ్ ఆప్టిక్స్‌పై ఫోకస్ పెట్టామని అన్నారు. ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్‌లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు డా. వీకే సారస్వత్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్ అడ్వైజరీ కౌన్సిల్‌కు నేతృత్వం వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని డా. వీకే సారస్వత్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనే మొక్కను మొలవనివ్వను: సీఎం రేవంత్‌రెడ్డి
చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలు
గణేశ్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు.. నెల రోజుల పాటు విజిబుల్ పోలీసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News