నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:39 PM
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని తెలంగాణ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. స్త్రీల రాజకీయ ఎదుగుదలలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని తెలంగాణ మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) వ్యాఖ్యానించారు. స్త్రీల రాజకీయ ఎదుగుదలలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఆయా సమస్యలకు భయపడకుండా వాటిని అధిగమించి వనితలు ఉన్నత స్థానాల్లోకి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో.. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు.. మహిళా రాజకీయ నాయకత్వం సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ గురుదీప్ సింగ్ సత్పాల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కోటా నీలిమ, పెద్దఎత్తున మహిళ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు.
నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా..
‘నా చిన్నతనంలో నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఆకలి బాధలు చూశాను.. అయినప్పటికీ అన్ని కష్టాలను ఎదుర్కొని.. నేడు ఈ స్థాయికి చేరుకున్నాను. ములుగు ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ పెద్దల అండదండలతో పంచాయతీరాజ్ శాఖకు మంత్రి కాగలిగాను. నాకు ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదు. అపర వనరులు ఉన్న ప్రాంతం ములుగు. అలాంటి ప్రాంతంలో ఒక పేద కుటుంబంలో నేను జన్మించాను. చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యాను. నేనెప్పుడూ నక్సలైట్ అవుతానని అనుకోలేదు.. కానీ నక్సలైట్ అయ్యాను. ఆ తర్వాత లాయర్, ఎమ్మెల్యే, మంత్రి అవుతానని ఎన్నడూ ఊహించలేదని.. కానీ కష్టాన్ని నమ్ముకొని పనిచేశాను. నేడు మంత్రిగా మీ ముందు ఉన్నాను’ అని మంత్రి సీతక్క తెలిపారు.
ప్రజలతోనే ఉండాలనేది నా సిద్ధాంతం...
‘నేను మంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పుడు నా మూలాలు మరిచిపోలేదు. ప్రజాజీవితమంటే జనంతోనే ఉండాలి. ఇప్పటికీ ప్రతివారం రెండు రోజులు.. నేను ములుగు ప్రజల మధ్యనే ఉంటాను. జనం ఎన్నుకున్నారని.. వారితోనే ఉండాలనేది నా సిద్ధాంతం. ఎమ్మెల్యే, మంత్రి కాగానే ప్రజలతో దూరంగా ఉండాలని.. అప్పుడే గౌరవం ఉంటుందని కొందరు భావిస్తారని.. కానీ నేను ఆ భావనకు పూర్తి విరుద్ధం. మేము ప్రజలకు జవాబుదారులమని.. బాసులం కాదని.. మనం సేవకులం. నాయకులకు ప్రజలే బలం. అయితే మహిళలు ఉన్నతస్థాయికి ఎదిగినా వివక్షతను ఎదుర్కొంటున్నారు. పురుష మంత్రులకు ఇచ్చినంత గౌరవం.. మహిళా మంత్రులకు ఇవ్వరు. అయినప్పటికీ మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. డెడికేషన్, డిటర్మీనేషన్‌తో పనిచేస్తూ పోవాలి. నా జీవితం కష్టాల కలపోత, పోరాటాలమయం. నా కష్టాలను. పోరాటాలను ఎప్పటికీ మర్చిపోను’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క
క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News