Share News

ఇందిరమ్మ టవర్స్ కాంట్రాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Oct 06 , 2026 | 03:34 PM

సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇందిరమ్మ టవర్స్ కాంట్రాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు: మంత్రి పొంగులేటి
Telangana Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఏడాదిలోపే వీటిని పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం వేగవంతం చేసే కాంట్రాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఒక నెల ముందుగా పూర్తి చేస్తే రూ.45 లక్షలు, రెండు నెలల ముందుగా పూర్తి చేస్తే రూ.90 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని పేర్కొన్నారు.


ఆన్‌లైన్‌లో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక..

కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో ఇళ్ల కోసం 7 వేల మందికి పైగా దరఖాస్తు చేశారని.. వీరిలో 5,218 మందిని అర్హులుగా గుర్తించామని మంత్రి పొంగులేటి తెలిపారు. బహిరంగ లక్కీ డ్రా ద్వారా 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేశామని స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్‌లో మూడు విడతల్లో మరిన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని వివరించారు. ప్రస్తుతం 7.5 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని చెప్పుకొచ్చారు.


పేదల సొంతింటి కలను కార్యరూపంలోకి తెస్తున్నాం..

ఇతర ప్రభుత్వ, హౌసింగ్ శాఖ భూములను గుర్తించి ఇళ్ల నిర్మాణం చేపడతామని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. లబ్ధిదారులు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు. పేదల సొంతింటి కలను కార్యరూపంలోకి తెస్తున్నామని అన్నారు. 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్

రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 04:51 PM