Share News

మోదీ నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణ..

ABN , Publish Date - May 07 , 2026 | 10:19 AM

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ విజయం సాధించిందని, ప్రధాని మోదీ తర్వాత టార్గెట్‌ తెలంగాణ రాష్ట్రమేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

మోదీ నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణ..
MP Konda Vishweshwar Reddy

  • చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ విజయం సాధించిందని, ప్రధాని మోదీ తర్వాత టార్గెట్‌ తెలంగాణ రాష్ట్రమేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 10న తెలంగాణలో మోదీ పర్యటన నేపథ్యంలో గురువారం మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్‌గుల్‌లోని పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయభేరి మోగించిందని, ఇదే ఊపు తెలంగాణలోనూ కొనసాగనున్నదని చెప్పారు.


city5.2.jpg10న పరేడ్‌గ్రౌండ్‌లో జరగనున్న మోదీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు పేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

తెలంగాణలో బీజేపీకి సానుకూల పవనాలు

Read Latest Telangana News and National News

Updated Date - May 07 , 2026 | 10:19 AM