ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ రైతుల ధర్నా
ABN , Publish Date - May 07 , 2026 | 09:59 AM
వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై అన్నదాతలు గురువారం ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
వరంగల్, మే 7 (ఆంధ్రజ్యోతి): వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై అన్నదాతలు ఈరోజు (గురువారం) ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలు నిర్వహించక పోగా తమను బెదిరింపులకు గురిచేస్తూ కొనుగోళ్లను పట్టించుకోవడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ రహదారి 563పై అన్నదాతలు ధర్నా చేపట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి వెంటనే కాంటాలు వేయాలని లేనిపక్షంలో రైతులందరం మరింత ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అన్నదాతలకు సర్ది చెప్పి ధర్నాను పోలీసులు విరమింపజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News