తెలంగాణలో బీజేపీకి సానుకూల పవనాలు
ABN , Publish Date - May 07 , 2026 | 09:49 AM
దేశవ్యాప్తంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని, తెలంగాణలో కూడా బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు
మోదీ బహిరంగ సభకు తరలిరండి: బీజేపీ స్టేట్ చీఫ్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని, తెలంగాణలో కూడా బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 10న పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని గురువారం తార్నాక డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బండారు ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్ పెయింటింగ్‌లో పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని ముఖ్యఅతిథిగా వచ్చే బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన.. రాష్ట్ర అభివృద్ధికి రూ.8 వేల కోట్ల నిధులను ప్రకటించనున్నారని తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కమలం పార్టీ భారీ విజయం సాధించడాన్ని మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ తట్టుకోలేక ప్రజాస్వామ్య తీర్పును అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్ గౌడ్, మేకల సారంగపాణి, గణేష్ ముదిరాజ్, నాగేశ్వర్ రెడ్డి, పోచయ్య యాదవ్, వేణు యాదవ్, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
Read Latest Telangana News and National News