ధాన్యం రవాణాపై రవాణా శాఖ కీలక ఆదేశాలు
ABN , Publish Date - May 07 , 2026 | 08:56 AM
ధాన్యం రవాణాపై తెలంగాణ రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వరి ధాన్యం తరలింపునకు వాహనాలను సమీకరించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా రవాణా అధికారులకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): ధాన్యం రవాణాపై తెలంగాణ రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వరి ధాన్యం తరలింపునకు వాహనాలను సమీకరించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా రవాణా అధికారులకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వేగంగా ధాన్యం రవాణాకు చర్యలు చేపట్టాలని సూచించారు. సరిపడా గూడ్స్ వాహనాలు అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు. అన్ని వాహనాలకు ఆర్సీ, ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు పత్రాలు తప్పనిసరిగా చేయాలని మార్గనిర్దేశం చేశారు. కలెక్టర్లు, సివిల్ సప్లైస్‌తో సమన్వయం చేయాలని ఆదేశించారు. ధాన్యం రవాణాలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News