పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
ABN , Publish Date - May 07 , 2026 | 06:45 AM
ఇటీవల రూ.1.5 లక్షల మార్క్ దిగువకు వచ్చిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తాజాగా మళ్లీ పైకి వెళ్లింది. బంగారం కొనాలనుకునే వారికి షాక్ కలిగిస్తోంది. గురువారం ఉదయం బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇటీవల రూ.1.5 లక్షల మార్క్ దిగువకు వచ్చిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తాజాగా మళ్లీ పైకి వెళ్లింది. మళ్లీ రూ.1.5 లక్షల మార్క్ దాటేసింది. బంగారం కొనాలనుకునే వారికి షాక్ కలిగిస్తోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది (Gold and Silver Rates).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,140గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,39,460గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,290గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,39,610గా ఉంది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర పెరుగుదల నమోదు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,75,100గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,65,100గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,75,100గా, బెంగళూరులో రూ.2,65,100గా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా
అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి