Share News

ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా

ABN , Publish Date - May 06 , 2026 | 07:31 AM

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంసార జీవితంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ట్రంప్ వల్ల ఒబామా తన భార్య, పిల్లలతో కాలం గడపలేకపోతున్నారట. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా ఈ విషయాన్ని వెల్లడించారు.

ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా
Barack Obama

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా సంసార జీవితంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ట్రంప్ వల్ల ఒబామా తన భార్య, పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారట. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ పరిపాలన సాగినంత కాలం క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలని ఒబామాపై డెమోక్రటిక్ పార్టీ ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో ఒబామా తన కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నారు (Obama family life tension).


'భర్త తన కోసం మరింత సమయం కేటాయించాలని ఆమె కోరుకుంటున్నారు. అయితే నా వల్ల ఆమె నిరాశకు గురవుతున్నారు. ఇది మా సంసారంలో ఇబ్బందులకు కారణమవుతోంది' అని ఒబామా వ్యాఖ్యానించారు. సాధారణంగా అమెరికా మాజీ అధ్యక్షులు రాజకీయాలకు దూరంగా ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తొలి రోజుల్లో ఒబామా కూడా అలాగే ఉండేవారు. అయితే కాలం గడిచే కొద్దీ ట్రంప్ విధానాలపై ఒబామా విమర్శలు గుప్పించడం ప్రారంభించారు (Trump presidency impact).


ఒబామా అమెరికా అధ్యక్ష పదవిని వదిలి దాదాపు 16 సంవత్సరాలు పూర్తవుతున్నాయి (Michelle Obama news). అయినప్పటికీ ఆయన డెమోక్రటిక్ పార్టీ గురించి సమయం కేటాయిస్తున్నారు. తాను ఒకవైపు పార్టీ, మరోవైపు భార్య మధ్య సతమతమవుతున్నానని ఒబామా తాజాగా పేర్కొన్నారు. ఇక రాజకీయాలు వద్దని భార్య మిషెల్ చెబుతున్నారట. అయితే ట్రంప్ పాలనా విధానాల వల్లే తాను క్రీయాశీల రాజకీయాల్లో కొనసాగాల్సి వస్తోందని ఒబామా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలి: టీపీసీసీ చీఫ్

తెలంగాణ బాగుపడాలంటే ఏకైక మార్గం.. : ఎంపీ ఈటల

Updated Date - May 06 , 2026 | 07:39 AM