Share News

ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 05 , 2026 | 04:20 PM

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌‌ను విడుదల చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని తెలిపారు.

ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, మే 05: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌‌ను విడుదల చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని తెలిపారు. మంగళవారం విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చరిత్రాత్మక గెజిట్‌ను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.


2026, జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని సీఎం చంద్రబాబు వివరించారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస - ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడం ద్వారా ఉత్తరాంధ్ర రవాణా రంగం ముఖచిత్రాన్ని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


నూతనంగా ఏర్పాటైన విశాఖపట్నం డివిజన్, రాయగడ డివిజన్‌ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఏపీ సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రాభివృద్ధికి.. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి ఈ రైల్వే జోన్ ఏర్పాటు దోహద పడుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

తెలంగాణ బాగుపడాలంటే ఏకైక మార్గం.. : ఎంపీ ఈటల

For More AP News And Telugu News

Updated Date - May 05 , 2026 | 04:37 PM