ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు
ABN , Publish Date - May 05 , 2026 | 03:21 PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. అందుకు సంబంధించిన సిఫార్సులను న్యాయశాఖకు సుప్రీంకోర్టు కొలీజియం పంపింది.
న్యూఢిల్లీ, మే 05: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. అందుకు సంబంధించిన సిఫార్సులను న్యాయశాఖకు సుప్రీంకోర్టు కొలీజియం పంపింది. ఈ సిఫార్సులను ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు న్యాయశాఖ పంపింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ముగ్గురు జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సి.హెచ్. పురుషోత్తమ కుమార్‌లను నియమించాలని నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం జ్యుడీషియల్ అధికారుల కేడర్‌లో ఉన్న ఈ ముగ్గురిని హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమోషన్ కల్పించనున్నట్లు అయింది. వీరి నియామకంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడుపై కాకాణివి అనవసరపు మాటలు: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ రాజీనామా; గవర్నర్ ఆమోదం
For More AP News And Telugu News