Share News

మహానాడుపై కాకాణివి అనవసరపు మాటలు: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

ABN , Publish Date - May 05 , 2026 | 02:45 PM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడుపై కాకాణి అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మహానాడుపై కాకాణివి అనవసరపు మాటలు: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
Kotamreddy Giridhar Reddy

నెల్లూరు, మే 5: టీడీపీ మహానాడుకు సంబంధించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు తెలుగు దేశం పార్టీ కుటుంబ పండుగ అని అన్నారు. మహానాడును కోవూరు నియోజకవర్గం కిసాన్ సెజ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమంతో మొదలవుతుందని.. జిల్లా నాయకత్వం మొత్తం హాజరవుతుందని తెలిపారు. మహానాడుపై మాజీ మంత్రి కాకాణి అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


మహానాడుతో వైసీపీకి ఏం పని అని కోటంరెడ్డి ప్రశ్నించారు. మహానాడు.. కార్యకర్తలతో మమేకం అయ్యే సమావేశమన్నారు. మహానాడుకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలుస్తామని చెప్పిన కాకాణి మాటలు రివర్స్ అయ్యాయని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కోటంరెడ్డి తెలిపారు. పెద్ద గొంతేసుకొని అరిస్తే అబద్ధం.. నిజం కాదన్నారు. గొడ్డలి పార్టీ అంటే వైసీపీ వణికిపోతోందన్నారు. వైసీపీ పార్టీ గొడ్డలి పార్టీ అని జగన్ సొంత చెల్లెలు చెప్పారని తెలిపారు. మంత్రి నారాయణ చెట్లలో దోపిడీ చేశారంటూ కాకాణి చేసిన ఆరోపణలకు ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ‘కాకాణి భాష బాగుంటే మేము సమాధానం ఇస్తాం. మీ భాషలో మీరు మాట్లాడితే, మా భాష వేరుగా ఉంటుంది’ అంటూ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

ఆకివీడు రామాలయం నిర్మాణంపై పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - May 05 , 2026 | 02:55 PM