Share News

ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ABN , Publish Date - May 05 , 2026 | 01:35 PM

ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉద్యోగుల సంఘం చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది.

ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
AP High Court

అమరావతి, మే 5: ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉద్యోగుల సంఘం చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఐఏఎస్ అహ్మద్ అనర్హుడంటూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా.. పిటిషన్‌ను కొట్టివేయాలని అహ్మద్ బాబు అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు(మంగళవారం) పిటిషన్‌పై విచారణ జరిపి.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఉద్యోగుల సంఘం ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


గత కొన్ని రోజులుగా అహ్మద్ బాబుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అన్ని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాల ముందు మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. చాలా మంది ఉద్యోగుల ప్రమోషన్లను అహ్మద్ తొక్కిపెడుతున్నారంటూ ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. దీనికి సంబంధించి నిన్న(సోమవారం) అధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశమై.. కోర్టు ఆదేశాలను పాటించాలని, ప్రమోషన్లపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఈ తరుణంలో అహ్మద్ బాబు అప్పీల్‌కు వెళ్లడంతో హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖతో పాటు అహ్మద్ బాబు నిర్వహిస్తున్న శాఖల్లో ఏదీ సవ్యంగా లేనట్లు కనిపిస్తోందని సింగిల్ జడ్జి చేసిన అబ్జర్వేషన్ (ప్రస్తావన)ను ధర్మాసనం పక్కనపెట్టింది. ఉద్యోగ సంఘం వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.


ఇవి కూడా చదవండి...

బెంగాల్ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు: పీవీఎన్ మాధవ్

ఆకివీడు రామాలయం నిర్మాణంపై పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

Read Latest AP News And Telugu News

Updated Date - May 05 , 2026 | 02:31 PM