ఆకివీడు రామాలయం నిర్మాణంపై పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
ABN , Publish Date - May 05 , 2026 | 11:35 AM
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడులో రామాలయం నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అమరావతి, మే 5: పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడులో రామాలయం నిర్మాణం అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్ని ఆధారాలు, రికార్డులు పరిశీలించిన తరువాత జిల్లా కలెక్టర్, నగర పంచాయితీ కమిషనర్ రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
గతంలో రామాలయం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపిన అనంతరం.. దీనిపై ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్‌లో రిట్ పిటిషన్లు ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని తెలిపింది. ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నామని హైకోర్టు చెప్పగా.. డిస్మోజ్ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఈ పిటిషన్‌ను హైకోర్టు డిస్మోజ్ చేసింది. అంతేకాకుండా పిల్‌ను ఉపసంహకరించుకున్నట్లు పిటిషనర్ల న్యాయవాది తెలిపారు. తాజాగా ఆలయ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు(మంగళవారం) హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉందని.. అన్నింటినీ పరిశీలించాకే కలెక్టర్, నగర పంచాయితీ కమిషనర్ అనుమతులు ఇచ్చారని పేర్కొంటూ.. పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి...
భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలధార - జలహారతి: మంత్రి బీసీ జనార్దన్
బెంగాల్ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు: పీవీఎన్ మాధవ్
Read Latest AP News And Telugu News