Share News

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలధార - జలహారతి: మంత్రి బీసీ జనార్దన్

ABN , Publish Date - May 05 , 2026 | 10:27 AM

భూగర్భ జలాలు పెరిగితే రైతులంతా తమ బోర్ల ద్వారా పంటలను సాగు చేసుకునే వీలుంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. 23 కిలోమీటర్ల కాల్వ పొడవున జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు ఐదు చెరువుల్లో మట్టి పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలధార - జలహారతి: మంత్రి బీసీ జనార్దన్
BC Janardhan Reddy

నంద్యాల, మే 5: రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సూచనల మేరకు జలధార - జల హారతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. హనుమంత గుండం చెరువు నుంచి దాదాపు 23 కిలోమీటర్లు కాలువ పొడవున ఉన్న 5 చెరువుల్లో, వాగులు, వంకల్లో మట్టి పూడికతీత పనులను సొంత నిధులతో చేపట్టామని అన్నారు. 3 మీటర్లలోపు భూగర్భ జలాలు వచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు.


భూగర్భ జలాలు పెరిగితే రైతులంతా తమ బోర్ల ద్వారా పంటలను సాగు చేసుకునే వీలుంటుందని బీసీ జనార్దన్ వెల్లడించారు. 23 కిలోమీటర్ల కాల్వ పొడవున జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు ఐదు చెరువుల్లో మట్టి పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. చెరువులు, కాలువల్లో పూడికతీత కార్యక్రమంలో భాగంగా మట్టిని.. అవసరమైన రైతులు తీసుకువెళ్లే విధంగా వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్పారు. మట్టిని తీసుకెళ్లే రైతులను ఇబ్బంది పెట్టకుండా అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం జలహారతి - జలధార కార్యక్రమాన్ని ఒక యజ్ఞం మాదిరిగా చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

తిరుపతి: చిట్వేలిలో దేవాంగ పిల్లి

భద్రాచలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి లిక్విడ్ పట్టివేత

Read Latest AP News And Telugu News

Updated Date - May 05 , 2026 | 10:32 AM