జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసుపై సజ్జనార్ స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - May 05 , 2026 | 10:19 AM
జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్, చీటింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు అన్నదమ్ములు.. 19 మంది మైనర్లను ట్రాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్, మే5 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్, చీటింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు అన్నదమ్ములు.. 19 మంది మైనర్లను ట్రాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) వెల్లడించారు. నిందితులను విచారించామని.. ఈ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో మూడుగంటల పాటు నిందితులను సీపీ ప్రశ్నించారు. అర్జున్ అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్, ప్రవీణ్‌లను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు.
రిచ్ కిడ్స్‌ను అర్జున్, ఆయన సోదరుడు ప్రవీణ్ టార్గెట్ చేశారని సజ్జనార్ వెల్లడించారు. మైనర్లను ట్రాప్ చేసి ఖరీదైన కార్లలోనే లైంగిక చర్యలకు అర్జున్ పాల్పడ్డాడని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎస్కార్ట్‌గా ఉంటూ మైనర్లకు వల విసిరారని చెప్పారు. అర్జున్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 150 మంది అమ్మాయిలు ఫాలో అవుతున్నారన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం అర్జున్ ప్రొఫైల్‌ను తాము లాక్ చేశామని తెలిపారు. ఇద్దరు నిందితులకు వారి తల్లి మీనాకుమారి కూడా సహకరించినట్లుగా గుర్తించామని అన్నారు. నిందితుల కుటుంబం గుంటూరుకు చెందినదిగా తమ దర్యాప్తులో తేలిందన్నారు. బాలికలు అట్రాక్ట్ అయ్యేలా ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్ రీల్స్ చేశాడని అన్నారు.
అక్కడి నుంచి బాలికలను ట్రాప్ చేసి రిచ్‌గా కారులో షికారు అంటూ హైదరాబాద్ రోడ్లపై అర్జున్ అన్నదమ్ములు తిప్పారని చెప్పారు. తమతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకునేలా బాలికలపై ఒత్తిడి చేశారన్నారు. ఆ వీడియోలను కూడా నిందితులు రికార్డు చేశారని.. సమయం చూసి తాము ఓ బిజినెస్ మొదలుపెడతామని బాధితులను నమ్మించి డబ్బు అడిగేవారని తెలిపారు. అలా ఓ బాలిక ఇంట్లో తెలియకుండా రూ. 13 లక్షలను నిందితులకు ఇచ్చిందన్నారు. గత ఏడాది కూడా ఇలాగే మరో మైనర్‌ను అర్జున్ ట్రాప్ చేశారని తెలిపారు. ఈ కేసులో మూడు రోజుల పాటు జైల్లో ఉండి ఆయన బయటకు వచ్చారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది: బండి సంజయ్
బీఆర్ఎస్ నేతల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు.. సీఎంపై కేటీఆర్ ధ్వజం
వెంకన్న ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి: బండ్ల గణేశ్
Read Latest Telangana News And AP News And International News And Telugu News