Share News

దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది: బండి సంజయ్

ABN , Publish Date - May 04 , 2026 | 12:01 PM

పశ్చిమబెంగాల్‌లో ఎన్నో అరాచకాలు జరిగాయని.. బంగ్లా చొరబాటు దారులకు దారులు మూసుకుపోయాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశం అంతా బీజేపీని కోరుకుంటోందని ఉద్ఘాటించారు.

దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది: బండి సంజయ్
Bandi Sanjay Kumar

కరీంనగర్, మే 4 (ఆంధ్రజ్యోతి): పశ్చిమబెంగాల్‌లో ఎన్నో అరాచకాలు జరిగాయని.. బంగ్లా చొరబాటు దారులకు దారులు మూసుకుపోయాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పేర్కొన్నారు. దేశం అంతా బీజేపీని కోరుకుంటోందని ఉద్ఘాటించారు. ఈరోజు (సోమవారం) కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని సీఎం రేవంత్‌రెడ్డి కలలు కంటున్నారని అన్నారు. సీఎం ఎక్కడికి వెళ్తే.. అక్కడ కాంగ్రెస్‌కు ఓటమినేనని ఎద్దేవా చేశారు. కేరళంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతోనే.. ఈ ఫలితాలు కాంగ్రెస్‌కు కొంత అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రావాలని ప్రజలు కోరుకున్నారని అన్నారు. బీజేపీకి అసలు ప్రచారకర్త రాహుల్ గాంధీనేనని బండి సంజయ్ సెటైర్లు గుప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మే 4 నుంచి 9 వరకు రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల

ఓఆర్‌ఆర్‌పై వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 04 , 2026 | 12:04 PM