Share News

భద్రాచలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి లిక్విడ్ పట్టివేత

ABN , Publish Date - May 05 , 2026 | 09:49 AM

భద్రాచలం పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అక్రమంగా తరలిస్తున్న కేజీ గంజాయి లిక్విడ్ బయటపడింది.

భద్రాచలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి లిక్విడ్ పట్టివేత
Ganja Liquid Smuggling

భద్రాద్రి కొత్తగూడెం, మే 5: భద్రాచలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి లిక్విడ్‌ను పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అక్రమంగా తరలిస్తున్న కేజీ గంజాయి లిక్విడ్ బయటపడింది. ఈ లిక్విడ్ మార్కెట్ విలువ సుమారు రూ.12.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు ఈ హాషిష్ లిక్విడ్‌ను ఒడిస్సా రాష్ట్రంలోని కలిమెల నుంచి నాగర్‌కర్నూల్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.


గంజాయి లిక్విడ్‌ను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కారును సీజ్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

టార్గెట్‌ తెలంగాణ?

తిరుపతి: చిట్వేలిలో దేవాంగ పిల్లి

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 05 , 2026 | 09:52 AM