Share News

బీ కేర్‌ఫుల్‌.. సిలిండర్లు పేలుతున్నాయ్‌.. జాగ్రత్త

ABN , Publish Date - May 05 , 2026 | 08:42 AM

హైదరాబాద్ నగరంలో ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట గ్యాస్‌ సిలిండర్లు పేలుతూ ప్రమాదాలు వెలుగు చూస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం.

బీ కేర్‌ఫుల్‌.. సిలిండర్లు పేలుతున్నాయ్‌.. జాగ్రత్త
Summer, Gas Cylinder

  • అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే

  • హెచ్చరిస్తున్న నిపుణులు, గ్యాస్‌ డీలర్లు

హైదరాబాద్: నగరంలో ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట గ్యాస్‌ సిలిండర్లు పేలుతూ ప్రమాదాలు వెలుగు చూస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. అందుకే సిలిండర్‌ వినియోగంలో అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు, గ్యాస్‌ డీలర్లు హెచ్చరిస్తున్నారు. సిలిండర్‌ రబ్బర్‌ ట్యూబ్‌ సరిగ్గా లేక పోవడం, నాబ్‌ను వినియోగించడంలో అజాగ్రత్త, రబ్బర్‌ ట్యూబ్‌ ఏర్పడిన రంధ్రాల ద్వార గ్యాస్‌ లీక్‌ కావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు పలు సూచనలు చేస్తున్నారు.


ఏజెన్సీల నిర్లక్ష్యం.. పరీక్షల్లో డొల్లతనం

గ్యాస్‌ వినియోగంలో జాగ్రత్తలు పాటించక పోతే ఆస్తి, ప్రాణ నష్టం జరగడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్యాస్‌ ఏజెన్సీల నిర్లక్ష్యం.. పరీక్షల్లో డొల్లతనం వలన గ్యాస్‌ పేలుడు ఘటనలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గ్యాస్‌ ప్రమాదానికి పరిహారం

గ్యాస్‌ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగవచ్చు. అలాంటి సమయాల్లో వినియోగ దారు బీమా పొందవచ్చు. ఆయిల్‌ సంస్థలే ఏజెన్సీ డీలర్‌తో ఏటా ప్రీమియం చెల్లించేలా చేస్తాయి. పబ్లిక్‌ లయబిలిటీ పథకం కింద ప్రతీ డీలర్‌ తన ఏజెన్సీ వాటా కింద రూ.10 వేలు బీమా కంపెనీకి చెల్లిస్తారు. ఫలితంగా బాధితుడు రూ.10 లక్షల వరకు పరిహారం పొందవచ్చు.


city3.2.jpgబీమా ఇలా పొందాలి

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వాలి. సంబంధిత డీలర్‌, తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వాలి. ఘటనా స్థలానికి ఆయిల్‌ కంపెనీ సంస్థ ప్రతినిధులు డీలర్‌ వచ్చి నివేదిక తయారు చేస్తారు. బాధితులు నష్టపోయిన వాటికి విలువ కట్టి పరిహారం ఇస్తారు. అదికూడా అనుకోకుండా ప్రమాదం జరిగితేనే పరిహారం అందుతుందని గుర్తించాలి.

నిబంధనలు ఇవీ..

  • ఇంట్లో నివసించే వారి పేరిట గ్యాస్‌ కనెక్షన్‌ ఉండాలి. ఆయిల్‌ సంస్థల నింబంధనల మేరకు గ్రీన్‌ లేబుల్‌ స్టవ్‌లు సురక్షా పైపులు వాడాలి.

  • సంస్థలు నిరాకరిస్తే బాధితులు కోర్టుకు వెళ్ల వచ్చు.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • సిలిండర్‌ను ఇంటికి తీసుకు రాగానే రెగ్యులేటర్‌ సరిగ్గా బిగించామా లేదా చెక్‌ చేసుకోవాలి.

  • కొన్నిసార్లు ఇంట్లో గ్యాస్‌ లీకేజీ వాసన వస్తుంది. ఆ సమయంలో లైట్లు వెలిగించడం, ప్యాన్‌ వేయడం అగ్గిపుల్ల వెలిగించడం చేయకూడదు. వెంటనే కిటికీలు తలుపులు పూర్తిగా తెరిచి గాలి వెలుతురు వచ్చే విధంగా జాగ్త్రలు తీసుకోవాలి. గ్యాస్‌ నాబ్‌ మూసి ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఇంకా అలాగే వాసన వస్తుంటే వెంటనే సమీపంలోని గ్యాస్‌ ఏజెన్సీలకు ఫోన్‌ చేయాలి.


city3.3.jpg

  • సిలిండర్‌లో బ్యూటేన్‌, ప్రొపేన్‌ గ్యాస్‌ నిర్దిష్టమైన పరిమాణంలో ఉండి తగిన శక్తి ఇస్తుంది. ప్రతీ మూడు నెలలకో సారి పైపు, గ్యాస్‌ పొయ్యిని తనిఖీ చేయించాలి. సిలిండర్‌ పక్కన మండే స్వభావం ఉన్న కిరోసిన్‌, పెట్రోల్‌ వంటివి ఉంచరాదు.

  • రబ్బరు ట్యూబును ఏడాది.. రెండేళ్ల కొకసారి మార్చాలి.

  • వంట చేస్తున్న సమయంలో వంట గది తలుపులు కిటికీ తెరిచి ఉంచాలి. వంట పూర్తి కాగానే రెగ్యులేగర్‌ కట్టి వేయాలి.

  • సెలవుల్లో ఊరికి వెళ్లినా.. సిలిండర్‌ ఉపయోగించక పోయినా వాల్‌ మూసివేసి సీల్‌ చేయాలి.


నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం..

మన నిర్లక్ష్యమే ప్రమాదాలకు దారితీస్తుంది. గ్యాస్‌ పొయ్యి, రెగ్యులేటర్‌, పైప్‌లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. గ్యాస్‌ పొయ్యి, పైప్‌నుంచి గానీ, సిలిండర్‌, రెగ్యులేటర్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ అవుతున్నట్లు గుర్తిస్తే.. రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేయాలి.

  • ఆనంద్‌, మేనేజర్‌, ఆర్‌పి, గ్యాస్‌ ఏజెన్సీ


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.5 లక్షల మార్క్ దిగువకు బంగారం ధరలు..

ఆ‘జాదు’ లీలలు అన్నీ ఇన్నీ కాదు

Read Latest Telangana News and National News

Updated Date - May 05 , 2026 | 08:42 AM