పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.5 లక్షల మార్క్ దిగువకు బంగారం ధరలు..
ABN , Publish Date - May 05 , 2026 | 06:25 AM
గత కొన్ని రోజులుగా రూ.1.5 లక్షలకు పైనే కొనసాగుతున్న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తాజాగా కిందకు దిగి వచ్చింది. ఇటీవల బంగారం ధర తగ్గుతూ వస్తుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది.
గత కొన్ని రోజులుగా రూ.1.5 లక్షలకు పైనే కొనసాగుతున్న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తాజాగా కిందకు దిగి వచ్చింది. ఇటీవల బంగారం ధర తగ్గుతూ వస్తుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి (Gold and Silver Rates).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,610గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,37,140గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,760గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,37,290గా ఉంది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గుదల నమోదు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,69,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,69,900గా, బెంగళూరులో రూ.2,64,900గా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి:
ఆర్సీబీకి బిగ్ షాక్.. ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్
ఓడిపోయే మ్యాచ్ గెలవడానికి అతడే కారణం: శుభ్‌మన్ గిల్