ఫ్యాన్ మూమెంట్.. దళపతి విజయ్‌కు వరుణ్ చక్రవర్తి స్పెషల్ విషెస్
ABN , Publish Date - May 04 , 2026 | 08:25 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోలీవుడ్ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. మెజారిటీ స్థానాలు గెలవడమే కాకుండా ఆయన స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ప్రత్యర్థులను ఓడించి సత్తా చాటారు. ఈ నేపథ్యంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోలీవుడ్ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. పార్టీని స్థాపించిన రెండేళ్లకే విజయ్ చరిత్ర లిఖించారు. టీవీకే ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ మెజారిటీ స్థానాలు గెలవడమే కాకుండా ఆయన స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ప్రత్యర్థులను ఓడించి సత్తా చాటారు. ఈ నేపథ్యంలో దళపతి విజయ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా మిస్టరీ స్పిన్నర్, తమిళనాడు క్రికెటర్ వరుణ్ చక్రవర్తి కూడా విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపాడు.
విజయ్‌తో కలిసి తీసుకున్న పాత ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘అన్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ‘మా అన్న గెలిచాడు’ అనే అర్థం వచ్చేలా పెట్టిన ఆ స్టోరీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది అయితే వరుణ్ చక్రవర్తి.. విజయ్‌తో పాటు ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు అభిమానినంటూ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. వరుణ్ భుజంపై విజయ్‌కు సంబంధించిన ట్యాటూ కూడా ఉంది. దీంతో ‘ఫ్యాన్ మూమెంట్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. కేకేఆర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న వరుణ్.. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లతో సత్తా చాటాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టోర్నీని వరుస పరాజయాలతో ఆరంభించిన కేకేఆర్.. గెలుపు బాట పట్టింది. ఆడిన 9 మ్యాచుల్లో వరుసగా మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
ఆర్సీబీకి బిగ్ షాక్.. ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్
ఓడిపోయే మ్యాచ్ గెలవడానికి అతడే కారణం: శుభ్‌మన్ గిల్