Share News

మిడిల్ ఆర్డర్‌పై వస్తున్న విమర్శలకు సుందర్ చెక్ పెట్టాడు: అశ్విన్

ABN , Publish Date - May 04 , 2026 | 05:05 PM

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చి 23 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సుందర్ ఆటతీరును టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు.

మిడిల్ ఆర్డర్‌పై వస్తున్న విమర్శలకు సుందర్ చెక్ పెట్టాడు: అశ్విన్
Washington Sundar

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. అద్భుత ప్రదర్శనలతో అగ్రస్థానంలో ఉన్న జట్లను జట్లను ఓడించి ఔరా అనిపించింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 19.5వ బంతికి వాషింగ్టన్ సుందర్ సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. దీంతో గుజరాత్.. పదింట్లో ఆరు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. అయితే ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చి 23 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి అద్భుత ప్రదర్శనతో జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచాడు. ఈ నేపథ్యంలో సుందర్ ఆటతీరును టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు.


‘గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. టాప్‌లో ఉన్న రెండు జట్లను వెనువెంటనే ఓడించడం అంత సులువైన విషయం కాదు. గుజరాత్ మిడిల్ ఆర్డర్‌పై కొద్ది రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలకు, సందేహాలకు తన నాక్‌తో సుందర్ చెక్ పెట్టాడు. ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చి కీలక సమయంలో పుంజుకున్నాడు. ఒత్తిడిని చక్కగా హ్యాండిల్ చేసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. దీంతో అతడిపై మేనేజ్‌మెంట్‌కు కూడా నమ్మకం కలుగుతుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు టాపార్డర్ పైనే ఎక్కువగా ఆధారపడుతుందన్న విమర్శలకు సుందర్ ఇన్నింగ్స్ సమాధానం. సుందర్‌కు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ ఇస్తుంటారు. కానీ అతడు ఈ పంజాబ్‌పై బాధ్యత తీసుకుని కూల్‌గా గుజరాత్‌ను గెలిపించాడు’ అని అశ్విన్.. సుందర్‌ను ప్రశంసించాడు.


ఇవి కూడా చదవండి:

ఆర్సీబీకి బిగ్ షాక్.. ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్

ఓడిపోయే మ్యాచ్‌ గెలవడానికి అతడే కారణం: శుభ్‌మన్ గిల్

Updated Date - May 04 , 2026 | 05:37 PM