Share News

ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు.. ఐపీఎల్‌లో గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌పై బీసీసీఐ అసంతృప్తి!

ABN , Publish Date - May 04 , 2026 | 02:45 PM

ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. టోర్నీలో ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు ముగిశాయి. అయితే ఈ సీజన్‌లో కొందరు ప్లేయర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు.. ఐపీఎల్‌లో గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌పై బీసీసీఐ అసంతృప్తి!
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. టోర్నీలో ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు ముగిశాయి. అయితే ఈ సీజన్‌లో కొందరు ప్లేయర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్య, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్.. లాంటి ఆటగాళ్లు తమ స్నేహితురాళ్లతో ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ప్రయాణిస్తున్నారు. దీనిపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కొంతమంది ఆటగాళ్ల భాగస్వాములు ‘ఇన్‌ఫ్లుయెన్సర్’ హోదా కలిగి ఉన్నారు. వీరిలో కొందరు గతంలో తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా, కొందరికి తమ స్నేహితురాళ్లతో విభేదాలు తలెత్తి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనివల్ల ఐపీఎల్‌తో పాటు బీసీసీఐ ప్రతిష్ఠకు కూడా ఇబ్బంది ఎదురవుతుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌పై బీసీసీఐ అధికారిక ప్రతినిధి ఒకరు స్పందించారు.


‘ఇప్పుడు ఈ గర్ల్‌ఫ్రెండ్ సంస్కృతికి అడ్డుకట్ట వేయకపోతే.. మున్ముందు ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. జట్టు బస్సులో క్రీడాకారులు తమ స్నేహితురాళ్ల కోసం వేచి ఉండే సందర్భాలనూ మేం గమనించాం. క్రికెటర్లతోపాటు వారు కూడా ఒకే హోటల్‌లో బస చేస్తున్నారు. ప్లేయర్లు అధికారికంగా తమ భాగస్వాములను ప్రకటించడంతో కొందరు యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు అనుమతి ఇస్తున్నట్లు మాకు సమాచారం అందింది. అయితే ఇలాంటి ‘అఫీషియల్ గర్ల్‌ఫ్రెండ్’ రూల్ ఉన్నట్టుండి ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. బీసీసీఐ పాలసీలో ఇలాంటి వాటికి చోటు లేదు. కొన్ని పరిమితుల మధ్య భార్య, కుటుంబసభ్యులను మాత్రమే అనుమతిస్తున్నాం. గర్ల్‌ఫ్రెండ్స్ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని బీసీసీఐ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

రైజర్స్‌ను కూల్చేశారు

గుజరాత్‌ హ్యాట్రిక్‌

Updated Date - May 04 , 2026 | 02:52 PM