ఓడిపోయే మ్యాచ్ గెలవడానికి అతడే కారణం: శుభ్‌మన్ గిల్
ABN , Publish Date - May 04 , 2026 | 07:58 AM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఆదివారం) అహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. వాషింగ్టన్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతోనే విజయం సాధించామని అన్నాడు. అతను లేకుంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోయేవాళ్లమని గిల్ తెలిపాడు.
శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. 'పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉంది. సెట్ అయిన బ్యాటర్ ఆఖరి వరకు ఆడాలని అనుకున్నాము. ఆ బాధ్యతను వాషింగ్టన్ సుందర్ నిర్వర్తించాడు. ఇలాంటి ఛేజింగ్‌ల్లో మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లకుండా ముందే ముగించాలి. ఇది 15 నుంచి16 ఓవర్ల మధ్యలో ఛేజ్ చేసే రకమైన పిచ్ కాదు. కాబట్టి మ్యాచ్‌ను ఒకటి లేదా రెండు ఓవర్ల ముందే ముగించాలని మేం అనుకున్నాం' అని గిల్ తెలిపాడు.
'ఇతర పిచ్‌ల లాగా ఇక్కడ లెంగ్త్ బంతులు బ్యాటింగ్‌కు అనుకూలంగా రాలేదు. అందుకే కుదురుకున్న బ్యాటర్ క్రీజులో ఉండటం చాలా కీలకంగా మారింది. మా జట్టులో వాషింగ్టన్ సుందర్ ఆ పని చేశాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. పరిస్థితులకు తగ్గట్లే బ్యాటర్లను పంపించాం. రైట్ హ్యాండర్స్, లెఫ్టాండ్స్ అనే విషయాన్ని పట్టించుకోలేదు 'అని గిల్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసి గెలుపొందింది. గుజరాత్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా.. పంజాబ్ కింగ్స్‌కు రెండో పరాజయం.
ఇవి కూడా చదవండి: