Share News

గుజరాత్‌ హ్యాట్రిక్‌

ABN , Publish Date - May 04 , 2026 | 02:37 AM

స్వల్ప ఛేదనే అయినా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆఖరి ఓవర్‌లో గట్టెక్కింది. అటు తమ బ్యాటర్లు విఫలమైన చోట పంజాబ్‌ బౌలర్లు పోరాడినా ఫలితం దక్కలేదు....

గుజరాత్‌ హ్యాట్రిక్‌

వరుసగా మూడో విజయం

పంజాబ్‌కు రెండో ఓటమి

అహ్మదాబాద్‌: స్వల్ప ఛేదనే అయినా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆఖరి ఓవర్‌లో గట్టెక్కింది. అటు తమ బ్యాటర్లు విఫలమైన చోట పంజాబ్‌ బౌలర్లు పోరాడినా ఫలితం దక్కలేదు. సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 57), వాషింగ్టన్‌ సుందర్‌ (23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 నాటౌ ట్‌) కీలక ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను ఆదుకున్నారు. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 4 వికెట్లతో నెగ్గింది. పంజాబ్‌కిది వరుసగా రెండో ఓటమి కాగా.. టైటాన్స్‌కు హ్యాట్రిక్‌ గెలుపు. ముందుగా పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. సూర్యాన్ష్‌ షెడ్గే (29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 57), స్టొయినిస్‌ (31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ హోల్డర్‌కు 4.. రబాడ, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో గుజరాత్‌ 19.5 ఓవర్లలో 167/6 స్కోరు చేసి గెలిచింది. అర్ష్‌దీప్‌, వైశాక్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. కెప్టెన్‌ గిల్‌ (5) విఫలమైనా.. సుదర్శన్‌, బట్లర్‌ (26) రెండో వికెట్‌కు 53 రన్స్‌ జోడించారు. అయితే ఆఖర్లో పంజాబ్‌ పట్టు బిగించడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. 6 బంతుల్లో 11 పరుగులు కావాల్సిన వేళ ఐదో బంతిని సుందర్‌ సిక్సర్‌గా మలచి మ్యాచ్‌ను ముగించాడు.

ఆదుకున్న సూర్యాన్ష్‌-స్టొయినిస్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఈ సీజన్‌లో తొలిసారి తడబడింది. పేసర్లు హోల్డర్‌, రబాడ, సిరాజ్‌ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన వేళ.. సూర్యాన్ష్‌, స్టొయినిస్‌ అద్భుతంగా ఆదుకున్నారు. దీంతో జట్టు కాస్త సవాల్‌ విసిరే స్కోరు చేయగలిగింది. ముందుగా భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ ప్రియాన్ష్‌ (2), కూపర్‌ (0)లను సిరాజ్‌ తొలి ఓవర్‌లోనే వెనక్కిపంపాడు. కెప్టెన్‌ శ్రేయాస్‌ (19), ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ (15) కొద్దిసేపు క్రీజులో నిలిచి మూడో వికెట్‌కు 33 రన్స్‌ జోడించారు. అటు పరుగులు రావడం కూడా కష్టంగా మారగా.. 47/5 స్కోరుతో పంజాబ్‌ తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో సూర్యాన్ష్‌ ఎదురుదాడికి దిగాడు. అతడికి స్టొయినిస్‌ సహకరించడంతో స్కోరుబోర్డులో కదలిక వచ్చింది. 14వ ఓవర్‌లో సూర్యాన్ష్‌ 6,6,4,4,6తో 27 రన్స్‌ రాబట్టగా జట్టు స్కోరు వంద దాటింది. దీంతో అతను 24 బంతుల్లోనే తన తొలి హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. కానీ 16వ ఓవర్లో సూర్యాన్ష్‌ను రబాడ అవుట్‌ చేయడంతో ఆరో వికెట్‌కు 79 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఇక 18వ ఓవర్‌లో స్టొయినిస్‌, బార్ట్‌లెట్‌ (0)లను వరుస బంతుల్లో హోల్డర్‌ పెవిలియన్‌కు చేర్చి ప్రత్యర్థి పరుగుల వేగానికి బ్రేక్‌ వేశాడు. ఆఖరి ఓవర్‌లో యాన్సెన్‌ (20) 6,4తో 14 పరుగులు రాగా, జట్టు స్కోరు కూడా 160 దాటింది.


స్కోరుబోర్డు

పంజాబ్‌: ప్రియాన్ష్‌ (సి) నిషాంత్‌ (బి) సిరాజ్‌ 2, ప్రభ్‌సిమ్రన్‌ (సి) సుతార్‌ (బి) రబాడ 15, కూపర్‌ (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 0, శ్రేయాస్‌ (బి) హోల్డర్‌ 19, వధేరా (సి) బట్లర్‌ (బి) హోల్డర్‌ 0, సూర్యాన్ష్‌ (సి) బట్లర్‌ (బి) రబాడ 57, స్టొయినిస్‌ (సి) వాషింగ్టన్‌ (బి) హోల్డర్‌ 40, యాన్సెన్‌ (సి) గిల్‌ (బి) రషీద్‌ 20, బార్ట్‌లెట్‌ (బి) హోల్డర్‌ 0, వైశాక్‌ (నాటౌట్‌) 1, అర్ష్‌దీప్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 163/9; వికెట్ల పతనం: 1-2, 2-2, 3-35, 4-36, 5-47, 6-126, 7-141, 8-141, 9-162; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-28-2, రబాడ 4-1-22-2, హోల్డర్‌ 4-0-24-4, అర్షద్‌ 3-0-29-0, రషీద్‌ 4-0-32-1, మానవ్‌ సుతార్‌ 1-0-27-0.

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) వైశాక్‌ 57, గిల్‌ (సి) కూపర్‌ (బి) అర్ష్‌దీప్‌ 5, బట్లర్‌ (సి) శ్రేయాస్‌ (బి) వైశాక్‌ 26, నిషాంత్‌ (సి) వైశాక్‌ (బి) స్టొయినిస్‌ 15, వాషింగ్టన్‌ (నాటౌట్‌) 40, తెవాటియా (సి) బట్లర్‌ (బి) యాన్సెన్‌ 2, హోల్డర్‌ (సి) కూపర్‌ (బి) అర్ష్‌దీప్‌ 5, అర్షద్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 19.5 ఓవర్లలో 167/6; వికెట్ల పతనం: 1-16, 2-69, 3-94, 4-124, 5-140, 6-152; బౌలింగ్‌: బార్ట్‌లెట్‌ 4-0-38-0, అర్ష్‌దీప్‌ 4-0-24-2, యాన్సెన్‌ 4-0-33-1, వైశాక్‌ 4-0-31-2, స్టొయినిస్‌ 2.5-0-26-1, చాహల్‌ 1-0-13-0.

ఇవి కూడా చదవండి..

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే

Updated Date - May 04 , 2026 | 02:37 AM