రైజర్స్‌ను కూల్చేశారు
ABN , Publish Date - May 04 , 2026 | 02:45 AM
బ్యాటర్ల వైఫల్యంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఐదు విజయాలకు బ్రేక్ పడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (3/36), సునీల్ నరైన్ (2/31) స్పిన్ మాయాజాలంతోపాటు...
నేటి మ్యాచ్
ముంబై X లఖ్‌నవూ
వేదిక : ముంబై రా.7.30
తిప్పేసిన వరుణ్, నరైన్
7 వికెట్లతో కోల్‌కతా గెలుపు
రాణించిన రహానె, రఘువంశీ
హైదరాబాద్: బ్యాటర్ల వైఫల్యంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఐదు విజయాలకు బ్రేక్ పడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (3/36), సునీల్ నరైన్ (2/31) స్పిన్ మాయాజాలంతోపాటు అంగ్‌క్రిష్ రఘువంశీ (47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) అర్ధ శతకంతో అదరగొట్టడంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్లతో సన్‌రైజర్స్‌కు ఝలకిచ్చింది. తొలుత సన్‌రైజర్స్ 19 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ ఆలౌటవడం ఇదే తొలిసారి. హెడ్ (28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 61) అర్ధ శతకంతో ఆకట్టుకోగా, ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42) ఫర్వాలేదనిపించాడు. కార్తీక్ త్యాగి 2 వికెట్లు తీశాడు. ఛేదనలో కోల్‌కతా 18.2 ఓవర్లలో 169/3 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు రహానె (43), అలెన్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 29) తొలి వికెట్‌కు 49 రన్స్ జోడించారు. అలెన్‌ను కమిన్స్ అవుట్ చేసినా.. రఘువంశీ, రహానె రెండో వికెట్‌కు 84 రన్స్ జోడించడంతో కోల్‌కతా గెలుపు దిశగా సాగింది. రహానెను సకీబ్, రఘువంశీని శివాంగ్ వెనక్కిపంపారు. కానీ, రింకూ (11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 22 నాటౌట్), గ్రీన్ (3 నాటౌట్) పది బంతులుండగానే మ్యాచ్‌ను గెలిపించారు.
పేకమేడలా..: హెడ్, ఇషాన్ దూకుడుగా ఆడడంతో.. ఒక దశలో 105/1తో భారీ స్కోరు చేసేలా కనిపించిన సన్‌రైజన్స్.. స్పిన్నర్లు వరుణ్, నరైన్ దెబ్బకు 10.1 ఓవర్లలో 60 పరుగులు మాత్రమే జోడించి మిగతా 9 వికెట్లు చేజార్చుకొంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న రైజర్స్‌కు ఓపెనర్లు అభిషేక్ (15), హెడ్ తొలి వికెట్‌కు 22 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. అయితే, నాలుగో ఓవర్లోనే అభిషేక్‌ను త్యాగి క్యాచవుట్ చేసినా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్, హెడ్ దీటుగా ఆడడంతో పవర్‌ప్లేను రైజర్స్ 71/1తో ముగించింది. ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న హెడ్.. 9వ ఓవర్‌లో వరుణ్ బౌలింగ్‌లో అవుటవ డంతో.. రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక, 11వ ఓవర్లో గ్రీన్ బౌలింగ్‌లో పావెల్ అందుకొన్న అద్భుత క్యాచ్‌తో క్లాసెన్ (11) వెనుదిరగడంతో రైజర్స్ బ్యాటింగ్ పేకమేడలా కూలింది. స్మరణ్ (4), అనికేత్ (6), సలీల్ (2), కెప్టెన్ కమిన్స్ (10), శివాంగ్ (1), హర్షల్ (6) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్: అభిషేక్ (సి) గ్రీన్ (బి) త్యాగి 15, హెడ్ (సి) గ్రీన్ (బి) వరుణ్ 61, ఇషాన్ (సి) అనుకూల్ (బి) నరైన్ 42, క్లాసెన్ (సి) పావెల్ (బి) గ్రీన్ 11, స్మరణ్ (సి) రహానె (బి) వరుణ్ 4, అనికేత్ (సి) రహానె (బి) వరుణ్ 6, సలీల్ (బి) నరైన్ 2, కమిన్స్ (సి అండ్ బి) అనుకూల్ 10, శివాంగ్ (సి) రఘువంశీ (బి) వైభవ్ 1, హర్షల్ (సి) వైభవ్ (బి) త్యాగి 6, మలింగ (నాటౌ ట్) 2; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19 ఓవర్లలో 165 ఆలౌట్; వికెట్ల పతనం: 1-44, 2-105, 3-117, 4-122, 5-135, 6-139, 7-148, 8-156, 9-156, 10-165; బౌలింగ్: నరైన్ 4-0-31-2, వైభవ్ 3-0-25-1, కార్తీక్ త్యాగి 4-0-30-2, గ్రీన్ 3-0-34-1, వరుణ్ 4-0-36-3, అనుకూల్ 1-0-8-1.
కోల్‌కతా: రహానె (సి) స్మరణ్ (బి) సకీబ్ 43, అలెన్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 29, రఘువంశీ (సి) మలింగ (బి) శివాంగ్ 59, రింకూ (నాటౌట్) 22, గ్రీన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 18.2 ఓవర్లలో 169/3; వికెట్ల పతనం: 1-49, 2-133, 3-151; బౌలింగ్: అభిషేక్ 2-0-14-0, కమిన్స్ 4-0-47-1, మలింగ 3.2-0-42-0, శివాంగ్ 4-0-31-1, హర్షల్ 2-0-17-0, సకీబ్ 3-0-17-1.

మ్యాచ్‌కు హాజరైన యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్,హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, చాముండేశ్వర్‌నాథ్, షట్లర్ పీవీ సింధు, ఆమె భర్త వెంకటదత్త సాయి, నటుడు రాహుల్
ఐపీఎల్‌లో 200 వికెట్ల క్లబ్‌లో చేరిన తొలి విదేశీ బౌలర్‌గా నరైన్ నిలిచాడు.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
పంజాబ్ 9 6 2 1 13 0.855
బెంగళూరు 9 6 3 0 12 1.420
హైదరాబాద్ 10 6 4 0 12 0.644
రాజస్థాన్ 10 6 4 0 12 0.510
గుజరాత్ 10 6 4 0 12 -0.147
చెన్నై 9 4 5 0 8 0.005
ఢిల్లీ 9 4 5 0 8 -0.895
కోల్‌కతా 9 3 5 1 7 -0.539
ముంబై 9 2 7 0 4 -0.803
లఖ్‌నవూ 8 2 6 0 4 -1.106
ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు
ఇవి కూడా చదవండి..
200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా
అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే