Share News

ఆర్సీబీకి బిగ్ షాక్.. ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్

ABN , Publish Date - May 04 , 2026 | 03:55 PM

ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలతో రాణిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కీలక సమయంలో బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌ల నుంచి ఆటకు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. తాజాగా ఇంగ్లండ్‌కు వెళ్లాడు.

ఆర్సీబీకి బిగ్ షాక్.. ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్
RCB

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలో రాణిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కీలక సమయంలో బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌ల నుంచి ఆటకు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. తాజాగా ఇంగ్లండ్‌కు వెళ్లాడు. గాయానికి సంబంధించిన టెస్టు కోసం తన స్వదేశానికి చేరుకున్నాడు. స్కానింగ్ తీసిన అనంతరం పరిస్థితిని బట్టి ఆర్సీబీ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. శస్త్రచికిత్స అవసరమైతే మాత్రం ఈ లీగ్ నుంచి వైదొలిగినట్లే. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సాల్ట్ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫిల్ సాల్ట్ స్థానంలో జాకబ్ బెథెల్ ఓపెనర్‌గా వస్తున్న సంగతి తెలిసిందే.


ఫిల్ సాల్ట్ ఓపెనర్‌గా దూకుడైన ఆటతీరుతో పరుగులు చేస్తాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి 202 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో ఆర్సీబీ కీలక ప్లేయర్ సాల్ట్ లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాల్ట్ స్థానంలో ఆడుతున్న బెథెల్.. పెద్దగా ప్రభావం చూపించడం లేదు. గత మూడు మ్యాచుల్లో 39 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఆరింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. తన తదుపరి మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మే 7న తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

రైజర్స్‌ను కూల్చేశారు

గుజరాత్‌ హ్యాట్రిక్‌

Updated Date - May 04 , 2026 | 04:09 PM