ఐపీఎల్ 2026: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్
ABN , Publish Date - May 04 , 2026 | 07:19 PM
ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఎంఐ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో లఖ్‌నవూ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఎంఐ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో లఖ్‌నవూ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బదులు సూర్యకుమార్ యాదవ్ టాస్ వేయడం గమనార్హం. ఇదిలా ఉంటే, గాయం కారణంగా గత ఐదు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరాడు. పేలవ ప్రదర్శన కనబరుస్తోన్న ఎంఐ బౌలర్ బౌల్ట్ స్థానంలో కార్బిన్‌ను తీసుకున్నారు. కాగా పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో ఉన్న ఇరుజట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. 9 మ్యాచుల్లో రెండు గెలిచిన ఎంఐ.. 9వ స్థానంలో ఉంది. 8 మ్యాచుల్లో రెండు గెలిచిన లఖ్‌నవూ పదో స్థానంలో కొనసాగుతోంది.
ఎంఐ తుది జట్టు
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బవా, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, బుమ్రా, ఘజన్‌ఫర్, రఘు శర్మ
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రోహిత్ శర్మ, మయాంక్ రావత్, మింజ్, శార్దూల్ ఠాకూర్, బౌల్ట్
ఎల్ఎస్‌జీ తుది జట్టు
రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రమ్, జోస్ ఇంగ్లిష్, నికోలస్ పూరన్, రఘువంశీ, హిమ్మత్ సింగ్, షమి, మొహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: మనిమారన్ సిద్ధార్ధ్, దిగ్వేశ్ సింగ్, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్
ఇవి కూడా చదవండి:
ఆర్సీబీకి బిగ్ షాక్.. ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్
ఓడిపోయే మ్యాచ్ గెలవడానికి అతడే కారణం: శుభ్‌మన్ గిల్