Share News

ఐపీఎల్ 2026: 'జై శ్రీరామ్' నోట్ చూపిన ముంబై స్పిన్నర్

ABN , Publish Date - May 05 , 2026 | 08:08 AM

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఒక భావోద్వేగపూరితమైన సన్నివేశం చోటుచేసుకుంది.

ఐపీఎల్ 2026: 'జై శ్రీరామ్' నోట్ చూపిన ముంబై స్పిన్నర్
Mumbai Indians beat Lucknow

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(సోమవారం) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఒక భావోద్వేగపూరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ లెగ్ స్పిన్నర్ రఘు శర్మ.. ఈ మ్యాచ్‌లో తొలి ఐపీఎల్‌ వికెట్ అందుకున్నాడు. ఈ వికెట్ తీసిన వెంటనే ఒక నోట్ తీసి ప్రేక్షకులవైపు చూపిస్తూ ఎమోషనలయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో తొలి బంతికి అక్షత్ రఘువంశీ (11)ని రఘు శర్మ క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో తన 15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. తొలి వికెట్ తీయడంతో రఘ శర్మ సంతోషానికి హద్దే లేకుండాపోయింది. ముందే ఒక నోట్ రాసిపెట్టుకొని జేబులో తెచ్చుకున్న రఘు శర్మ.. వికెట్ తీసిన వెంటనే ప్రేక్షకుల వైపు చూపిస్తూ సంబరం చేసుకున్నాడు.'రాధే రాధే.. గురుదేవుల కృపతో నా 15 ఏళ్ల బాధాకరమైన నిరీక్షణ ముగిసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. జై శ్రీరామ్' అని నోట్ లో రాసి ఉంది. దీంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన లక్ష్యం కోసం 15 ఏళ్లుగా కష్టపడుతున్న అతని పట్టుదలను ప్రశంసిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

రోహిత్‌ రికెల్టన్‌ షో

జిమ్నాస్టిక్స్‌లో వైష్ణవికి పసిడి

Updated Date - May 05 , 2026 | 08:48 AM