Share News

రోహిత్‌ రికెల్టన్‌ షో

ABN , Publish Date - May 05 , 2026 | 05:42 AM

ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయిన వేళ.. మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ అదరగొట్టింది. వెటరన్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 84) చాలా రోజుల తర్వాత...

రోహిత్‌ రికెల్టన్‌ షో

నేటి మ్యాచ్‌

ఢిల్లీ X చెన్నై

వేదిక ఢిల్లీ రా.7.30

లఖ్‌నవూపై ముంబై ఘన విజయం

ముంబై: ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయిన వేళ.. మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ అదరగొట్టింది. వెటరన్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 84) చాలా రోజుల తర్వాత బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతడికి రికెల్టన్‌ (32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 83) సహకరించడంతో సోమవారం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై నెగ్గింది. పది మ్యాచ్‌ల్లో ఈ జట్టుకిది కేవలం మూడో విజయం. అలాగే మిగిలిన నాలుగు మ్యాచ్‌లనూ గెలిచి మిగతా టీమ్స్‌ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అటు కేవలం 4 పాయింట్లతో ఉన్న లఖ్‌నవూకు ఇది వరుసగా ఆరో ఓటమి, దీంతో ఈ జట్టు కూడా దాదాపుగా నిష్క్రమించినట్టే. ముందుగా లఖ్‌నవూ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ (21 బంతుల్లో 1 ఫోర్‌, 8 సిక్సర్లతో 63), మార్ష్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), హిమ్మత్‌ (31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్‌), మార్‌క్రమ్‌ (25 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 31 నాటౌట్‌) రాణించారు. బాష్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసి గెలిచింది. సిద్ధార్థ్‌కు 2వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా రికెల్టన్‌ నిలిచాడు.


ఛేదన జోరుగా..: భారీ ఛేదనను ఆత్మవిశ్వాసంతో ఆరంభించిన ముంబై ఏ దశలోనూ తడబడలేదు. ఓపెనర్లు రోహిత్‌, రికెల్టన్‌ల ధాటికి లఖ్‌నవూ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముందుగా రికెల్టన్‌ జోరు చూపించినా.. కాస్త కుదురుకున్నాక రోహిత్‌ జోరు ఆరంభమైంది. ఆరో ఓవర్‌లో 4,4,6,6తో రోహిత్‌ ఒక్కసారిగా గేరు మార్చాడు. దీంతో ముంబై పవర్‌ప్లేలో 71 పరుగులతో నిలిచింది. 22 బంతుల్లో రికెల్టన్‌, 27 బంతుల్లో రోహిత్‌ ఫిఫ్టీలు పూర్తి చేశారు. తొమ్మిదో ఓవర్‌లో రికెల్టన్‌ 6,4,6తో 23 రన్స్‌ సమకూరాయి. అలాగే మొహిసిన్‌ ఓవర్‌లోనూ 4,6,6తో చెలరేగిన అతడు ఐదో బంతికి ఇన్‌గ్లి్‌సకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యానికి చెక్‌ పడింది. అటు రోహిత్‌ మాత్రం బౌండరీలతో తన దూకుడు కొనసాగించడంతో పరుగుల వేగం తగ్గలేదు. సెంచరీ దిశగా సాగుతున్న హిట్‌మ్యాన్‌ను స్పిన్నర్‌ సిద్ధార్థ్‌ 14వ ఓవర్‌లో అవుట్‌ చేశాడు. అప్పటికి ఆరు ఓవర్లలో 52 పరుగులే కావాల్సి ఉండడంతో ముంబై ఇబ్బందిపడలేదు. తిలక్‌ (11), సూర్య (12) విఫలమైనా నమన్‌ ధిర్‌ (23 నాటౌట్‌) చివరికంటా నిలిచి 8 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.

పూరన్‌ ఎదురుదాడి: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ మెరుపు వేగంతో సాగింది. నికోలస్‌ పూరన్‌ సీజన్‌లో తొలిసారి బ్యాట్‌ ఝుళిపించాడు. అతడికి ఓపెనర్‌ మార్ష్‌ సహకరించడంతో ముంబై బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. దీంతో 250 పరుగులు కూడా ఖాయమే అనుకున్న వేళ ఈ ఇద్దరి నిష్క్రమణ తర్వాత జట్టు లయ తప్పింది. దీనికి తోడు డెత్‌ ఓవర్లలో ముంబై బౌలర్లు మరింత కట్టడి చేయడంతో ఎల్‌ఎ్‌సజీ ఆశించిన స్కోరు చేయలేకపోయింది. మార్ష్‌ తొలి ఓవర్‌లోనే 6,4తో బ్యాట్‌కు పనిజెప్పాడు. కానీ మూడో ఓవర్‌లో ఓపెనర్‌ ఇన్‌గ్లిస్‌ (13)ను స్పిన్నర్‌ ఘజన్‌ఫర్‌ అవుట్‌ చేశాడు. అటు బుమ్రా ఓవర్‌లో మార్ష్‌ 6,4,4తో 21 పరుగులు రాబట్టగా.. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన పూరన్‌ ఐదో ఓవర్‌లో మూడు సిక్సర్లతో చెలరేగాడు. ఘజన్‌ఫర్‌ ఓవర్‌లోనూ అతడు 4,6,6 బాదగా ఎల్‌ఎ్‌సజీ 90/1తో పవర్‌ప్లేలో తమ అత్యధిక స్కోరును సాధించింది. అలాగే 16 బంతుల్లోనే పూరన్‌ హాఫ్‌ సెంచరీ కూడా పూర్తయ్యింది. ఎనిమిది ఓవర్లలోనే 123 పరుగులు చేసిన లఖ్‌నవూ దూకుడుకు పేసర్‌ బాష్‌ బ్రేక్‌ వేశాడు. తొమ్మిదో ఓవర్‌లో అతడు పూరన్‌, మార్ష్‌ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చి ముంబైకి రిలీ్‌ఫనిచ్చాడు.


దీంతో రెండో వికెట్‌కు 35 బంతుల్లోనే 94 పరుగుల తుఫాన్‌ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మధ్య ఓవర్లలో పరుగులు నెమ్మదించగా, కెప్టెన్‌ పంత్‌ (15)తో పాటు తొలి ఐపీఎల్‌ ఆడిన అక్షత్‌ (11) ఒక్క ఓవర్‌ వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో హిమ్మత్‌, మార్‌క్రమ్‌ క్రీజులో నిలిచి ఆరో వికెట్‌కు అజేయంగా 68 రన్స్‌ జత చేశారు. 15 ఓవర్లలోనే 175/5 స్కోరుతో నిలిచిన లఖ్‌నవూ 240 రన్స్‌ చేయగలదని అంచనా వేశారు. కానీ చివరి మూడు ఓవర్లలో పుంజుకున్న ముంబై బౌలర్లు కేవలం ఒక్క ఫోర్‌తో 22 పరుగులే ఇవ్వడంతో ఎల్‌ఎ్‌సజీ 220+ రన్స్‌తో సరిపెట్టుకుంది.

స్కోరుబోర్డు

లఖ్‌నవూ: మార్ష్‌ (సి) నమన్‌ (బి) బాష్‌ 44, ఇంగ్లిస్‌ (సి) సూర్య (బి) ఘజన్‌ఫర్‌ 13, పూరన్‌ (సి) రికెల్టన్‌ (బి) బాష్‌ 63, పంత్‌ (సి) రికెల్టన్‌ (బి) జాక్స్‌ 15, మార్‌క్రమ్‌ (నాటౌట్‌) 31, అక్షత్‌ రఘువంశీ (సి అండ్‌ బి) రఘుశర్మ 11, హిమ్మత్‌ (నాటౌట్‌) 40; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 228/5; వికెట్ల పతనం: 1-29, 2-123, 3-125, 4-148, 5-160; బౌలింగ్‌: చాహర్‌ 4-0-43-0, బుమ్రా 4-0-45-0, ఘజన్‌ఫర్‌ 4-0-50-1, జాక్స్‌ 2-0-34-1, బాష్‌ 2-0-20-2, రఘుశర్మ 4-0-36-1.

ముంబై: రికెల్టన్‌ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) మొహిసిన్‌ 83, రోహిత్‌ (సి) షమి (బి) సిద్దార్థ్‌ 84, తిలక్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) సిద్దార్థ్‌ 11, సూర్యకుమార్‌ (సి) పూరన్‌ (బి) షమి 12, నమన్‌ (నాటౌట్‌) 23, జాక్స్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 18.4 ఓవర్లలో 229/4; వికెట్ల పతనం: 1-143, 2-177, 3-189, 4-213; బౌలింగ్‌: షమి 4-0-53-1, మొహిసిన్‌ 4-0-47-1, ప్రిన్స్‌ 3-0-24-0, అవేశ్‌ 3.4-0-56-0, సిద్దార్థ్‌ 4-0-47-2.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 9 6 2 1 13 0.855

బెంగళూరు 9 6 3 0 12 1.420

హైదరాబాద్‌ 10 6 4 0 12 0.644

రాజస్థాన్‌ 10 6 4 0 12 0.510

గుజరాత్‌ 10 6 4 0 12 -0.147

చెన్నై 9 4 5 0 8 0.005

ఢిల్లీ 9 4 5 0 8 -0.895

కోల్‌కతా 9 3 5 1 7 -0.539

ముంబై 10 3 7 0 6 -0.649

లఖ్‌నవూ 9 2 7 0 4 -1.076

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

2

ఐపీఎల్‌లో 20 అంతకన్నా తక్కువ బంతుల్లోనే ఎక్కువ హాఫ్‌ సెంచరీలు (5) చేసిన రెండో బ్యాటర్‌గా పూరన్‌. అభిషేక్‌ (6) ముందున్నాడు.

ఇవి కూడా చదవండి..

బెంగాల్‌‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ

తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి

Updated Date - May 05 , 2026 | 05:42 AM