తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
ABN , Publish Date - May 04 , 2026 | 05:35 PM
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమిని చవిచూశారు. కొళత్తూర్ నియోజకవర్గంలో టీవీకే నేత వీఎస్ బాబు చేతిలో 9 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎమ్‌కే అధినేత స్టాలిన్ ఓటమిని చవిచూశారు. కొళత్తూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన స్టాలిన్.. టీవీకే పార్టీ నేత వీఎస్ బాబు చేతిలో ఓటమి చెందారు. 9 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. వీఎస్ బాబుకు 82 వేల పైచిలుకు ఓట్లు రాగా, స్టాలిన్‌కు దాదాపు 73 వేల ఓట్లు పోలయ్యాయి. అన్నాడీఎమ్‌కేకు చెందిన సంతానకృష్ణన్ దాదాపు 14 వేల ఓట్లతో మూడవ స్థానానికి పరిమితమయ్యారు. 1996 తరువాత డీఎమ్‌కే అధినేతకు ఓటమి ఎదురు కావడం ఇదే తొలిసారి.
వీఎస్ బాబు గతంలో డీఎమ్‌కే, ఏఐఏడీఎమ్‌కే పార్టీల్లో సేవలందించారు. 2006-11 మధ్య పురసవల్కం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2011 వరకూ డీఎమ్‌కే ఉత్తర చెన్నై డిస్ట్రిక్ట్ సెక్రటరీగా కూడా ఉన్నారు. 2011 నాటి ఎన్నికల్లో కొళత్తూర్ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో సీఎం స్టాలిన్‌కు మెజారిటీ తగ్గడంతో విమర్శల పాలయ్యారు. అనంతరం అన్నాడీఎమ్‌కేలో చేరారు. ఈ ఏడాది నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీలో చేరారు. ఇక తాజాగా ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రస్తుతం 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఇవి కూడా చదవండి..
విజయ్‌కు మెజారిటీ తగ్గితే.. కలిసొచ్చే పార్టీలు ఇవేనా
వెస్ట్ బెంగాల్ సీఎం రేసులో బీజేపీ దిగ్గజాలు.. సువేందు అధికారి, దిలీప్ ఘోష్!