ముఖేష్ డబుల్ ధమాకా
ABN , Publish Date - May 05 , 2026 | 05:35 AM
జాతీయ షూటింగ్ చాంపియన్‌షి్‌పలో గుంటూరు షూటర్ నేలవల్లి ముఖేష్ రెండు స్వర్ణాలు కొల్లగొట్టాడు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ షూటింగ్ చాంపియన్‌షి్‌పలో గుంటూరు షూటర్ నేలవల్లి ముఖేష్ రెండు స్వర్ణాలు కొల్లగొట్టాడు. సోమవారం జరిగిన 25 మీటర్ల జూనియర్, సీనియర్ రెండు విభాగాల్లోనూ ముఖేష్ చాంపియన్‌గా నిలిచాడు. న్యూఢిల్లీలోని కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో జరిగిన ఈ పోటీల్లో 25 మీ., పిస్టల్ ఈవెంట్ రెండు విభాగాల్లోనూ ముఖేష్ 584/600 స్కోరు సాధించి, అగ్రస్థానంలో నిలిచాడు. రెండు విభాగాల్లోనూ సూరజ్ శర్మ (మధ్యప్రదేశ్) రజతం, శ్రవణ్ శశిధర్ (కర్ణాటక) కాంస్యం దక్కించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
బెంగాల్‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ