ఆ‘జాదు’ లీలలు అన్నీ ఇన్నీ కాదు
ABN , Publish Date - May 05 , 2026 | 07:09 AM
ఇన్‌స్టాలో రీల్స్.. ఖరీదైన కార్లలో తిరుగుతున్న స్టైలిష్ ఫొటోలు.. స్టార్టప్ పెట్టి కంపెనీ నిర్వహిస్తున్నట్టు ప్రచారాలు.. ఇలా అమ్మాయిలను ఆకట్టుకునేందుకు చేయని స్టంట్‌లు లేవు.
ఇన్‌స్టాలో ‘ఎస్‌కార్ట్’ సేవలు
ఖరీదైన కార్లు, స్టార్టప్‌ల పేరిట అమ్మాయిలకు వల
భారీగా డబ్బు లాగుతూ మోసాలు
పోక్సో చట్టం కింద కేసు నమోదైనా మారని తీరు
కస్టడీలో మరిన్ని వివరాలు సేకరించిన పోలీసులు
చంద్రశేఖర్ ఆజాద్ కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ఠాణాకు వచ్చిన సీపీ
హైదరాబాద్: ఇన్‌స్టాలో రీల్స్.. ఖరీదైన కార్లలో తిరుగుతున్న స్టైలిష్ ఫొటోలు.. స్టార్టప్ పెట్టి కంపెనీ నిర్వహిస్తున్నట్టు ప్రచారాలు.. ఇలా అమ్మాయిలను ఆకట్టుకునేందుకు చేయని స్టంట్‌లు లేవు. డబ్బు కోసం వలపు పనికి వెళ్లేందుకు వెనకాడడు. దారికి రాని అమ్మాయిలను ప్రేమపేరుతో శారీరక సంబంధాలు పెట్టుకొని లక్షలు లాగుతాడు. ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. అతడి బారిన పడి మోసపోయిన బాధితులు ఇంకా ఉన్నారు. కానీ బయటకు రావడం లేదు. గత నెలలో బాలిక, మహిళతో పెళ్లి పేరుతో శారీరక సంబంధాలు కొనసాగించి డబ్బు లాగి మోసం చేసిన కొండూరి చంద్రశేఖర్ ఆజాద్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. డబ్బున్న అమ్మాయిలకే వల వేసినట్టు మోసాలు చేసినట్టు విచారణలో తెలుస్తుంది. చంద్రశేఖర్ ఆజాద్ కస్టడీ సోమవారం ముగుస్తుండడంతో నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ స్వయంగా జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో విచారణ చేశారు.
సిట్యువేషన్‌షిప్ అంటూ స్నేహాలు
బీటెక్ పూర్తి చేసిన చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం ఎంత వరకు దిగజారేందుకైనా సిద్ధపడ్డాడు. ఇన్‌స్టా ఎస్‌కార్ట్ పేరిట మిగతా సోషల్ మీడియాలో సిట్యువేషన్ షిప్ అంటూ స్నేహాలు, శారీరక వాంచలు తీర్చుకోవడమే కాదు.. బాధిత అమ్మాయిల నుంచి డబ్బు లాగడంలో కూడా నేర్పరి. చంద్రశేఖర్‌ను ఇన్‌స్టాలో సుమారు 150 మంది అమ్మాయిలు ఫాలో అవుతున్నారు. వీరంతా డబ్బున్న కుటుంబానికి చెందిన వారే. ప్రతీ రోజు రోమాంటిక్ మూడ్ అంటూ ఖరీదైన దుస్తులు ధరించి రీల్స్ చేసి పెడుతుంటాడు. కామెంట్ చేసిన అమ్మాయిలను ముగ్గులోకి దించుతాడు. ఎస్‌కార్ట్, సిట్యువేషన్ షిప్ పేరిట అమ్మాయిలు కోరుకున్న ఖరీదైన కారు తీసుకొని లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్తాడు.
కారులో శారీరక కోరికలు తీర్చుకొని భారీగా డబ్బు తీసుకుంటాడు. ఒకవేళ ఎస్‌కార్ట్‌కు లొంగని వారు ఉంటే ప్రేమపేరిట ముగ్గులోకి దించి లైంగికంగా సంబంధాలు పెట్టుకోవడంతోపాటు లక్షలు లాగుతాడు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ బాలికను ఇలాగే మోసం చేశాడు. ప్రేమపేరుతో బాలికకు దగ్గరయ్యాడు. ఇది బాలిక ఇంట్లో తెలిసింది. వారి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రశేఖర్ బాలికతో సంబంధాలు కొనసాగించి సుమారు రూ.13 లక్షలు తీసుకున్నాడు. మరో యువతిని ప్రేమ పేరుతో లైంగిక వాంఛను తీర్చుకోవడమే కాకుండా డబ్బు, బంగారు అభరణాలు తీసుకున్నాడు. ఇలా మరికొంత మంది చంద్రశేఖర్ బారిన పడిన బాధితులు ఉన్నట్టు విచారణలో తేలింది. అయితే వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని తెలిసింది.
తల్లి, మేనమామపై కేసు..!
చంద్రశేఖర్ ఆజాద్ చిన్నతనంలో తండ్రి మరణించాడు. తల్లి మీనాకుమారి, మేనమామ సంరక్షణలో పెరిగాడు. చంద్రశేఖర్ చేస్తున్న వికృత క్రీడల గురించి తల్లి, మేనమామకు తెలుసు. పలు మార్లు చంద్రశేఖర్ బాధిత అమ్మాయిల వద్ద నుంచి డబ్బును పలుమార్లు మీనాకుమారి బ్యాంక్ ఖాతాలో జమచేసినట్టు విచారణలో తేలింది. ఈ క్రమంలో అన్ని తెలిసి కూడా అతడిని అడ్డుకోవడంలో విఫలమైన తల్లి, మేనమామపై కేసులు పెట్టే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
హజ్‌యాత్రకు బయల్దేరిన మరో 185 మంది
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం..ఆరు దుకాణాలు దగ్ధం
Read Latest Telangana News and National News