రికార్డు కనిష్ఠానికి రూపీ
ABN , Publish Date - May 05 , 2026 | 05:52 AM
భారత కరెన్సీ సరికొత్త ఆల్‌టైం రికార్డు కనిష్ఠానికి పతనమైంది. ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం...
ఒక్కరోజులో 39 పైసలు క్షీణత
రూ.95.23 వద్ద ముగింపు
భారత కరెన్సీ సరికొత్త ఆల్‌టైం రికార్డు కనిష్ఠానికి పతనమైంది. ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 39 పైసలు క్షీణించి రూ.95.23 వద్ద ముగిసింది. ఏప్రిల్ 30, మార్చి 30న ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎక్స్ఛేంజీ రేటు రూ.95 స్థాయిని దాటినప్పటికీ, ఈ మార్క్ ఎగువన ముగియడం మాత్రం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గరిష్ఠ స్థాయి ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, వృద్ధి మందగమనం భయాల నేపథ్యంలో రూపీ మరింత క్షీణించిందని ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలూ చదవండి:
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ జోరు.. సన్ టీవీ షేర్లు పతనం..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..