Share News

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ జోరు.. సన్ టీవీ షేర్లు పతనం..

ABN , Publish Date - May 04 , 2026 | 01:59 PM

గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలు డీఎంకే, ఏడీఎంకే చుట్టే తిరుగుతున్నాయి. అయితే డీఎంకే, లేదంటే ఏడీఎంకే అధికారంలోకి వస్తూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత మూడో పార్టీ ఈ రెండింటినీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వచ్చింది.

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ జోరు.. సన్ టీవీ షేర్లు పతనం..
Vijay TVK

గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలు డీఎంకే, ఏడీఎంకే చుట్టే తిరుగుతున్నాయి. అయితే డీఎంకే, లేదంటే ఏడీఎంకే అధికారంలోకి వస్తూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత మూడో పార్టీ ఈ రెండింటినీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వచ్చింది. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే.. బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లోనే సత్తా చాటింది (Vijay TVK).


అన్నా డీఎంకే, డీఎంకే పార్టీలను వెనక్కి నెట్టిన టీవీకే ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ జోరు కారణంగా డీఎంకే నేత, స్టాలిన్‌కు బంధువైన కళానిధి మారన్‌కు చెందిన సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు పతనమయ్యాయి. ఇప్పటివరకు అధికారం అనుభవించిన డీఎంకే తాజా ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైంది. దీంతో సన్ టీవీ షేర్లు దాదాపు 9.5 శాతం మేర పతనమయ్యాయి (Sun TV Shares Fall).


ఒక దశలో సన్ టీవీ నెట్‌వర్క్ షేర్ 9.5 శాతం మేర పతనమై 547.55 వద్ద కనిష్ఠానికి చేరింది (Stock Market Impact Elections). అయితే ఆ తర్వాత కాస్త కోలుకుంది. మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో 6 శాతం నష్టంతో 566 వద్ద కొనసాగుతోంది. కాగా, ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత కిందకు దిగివచ్చాయి. ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఒక దశలో దాదాపు 1000 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ప్రస్తుతం 339 పాయింట్ల లాభంతో 77,252 వద్ద కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


కాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు..

Updated Date - May 04 , 2026 | 02:01 PM