Share News

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే హవా.. విజయ్ ఇంట్లో సంబరాలు..

ABN , Publish Date - May 04 , 2026 | 12:55 PM

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ హవా కొనసాగుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. దీంతో విజయ్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి.

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే హవా.. విజయ్ ఇంట్లో సంబరాలు..
Vijay Family Celebration

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ హవా కొనసాగుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆధిక్యంలో ఉంది. దీంతో విజయ్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. విజయ్ కుటుంబ సభ్యులు విజిల్స్ ఊదుతూ సంబరాలు చేసుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Vijay TVK).


టీవీకే భారీ ఆధిక్యం దిశగా సాగుతుండడంతో టీవీకే నేతలు, విజయ్ అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతానికి విజయ్ టీవీకే 105 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏడీఎంకే 71 సీట్లోలనూ, డీఎంకే 57 స్థానాల్లోనూ లీడింగ్‌లో ఉన్నాయి. కాగా, 234 సీట్ల తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు సాధించాల్సి ఉంటుంది (Tamil Nadu Election 2026).


ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తుంటే మెజారిటికీ దగ్గరగా విజయ్ పార్టీ వచ్చేలా కనిపిస్తోంది (Vijay Family Celebration). ఒకవేళ హంగ్ ఏర్పడితే ఏడీఎంకేతో కలిసి టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా విజయ్ తమిళనాడు తదుపరి సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


కాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు..

Updated Date - May 04 , 2026 | 12:56 PM