Share News

షాకింగ్ ట్రెండ్స్.. బెంగాల్, తమిళనాడు, కేరళంలో ముఖ్యమంత్రుల వెనుకంజ..

ABN , Publish Date - May 04 , 2026 | 11:15 AM

గత నెలలో జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఓ షాకింగ్ ట్రెండ్ కనబడుతోంది.

షాకింగ్ ట్రెండ్స్.. బెంగాల్, తమిళనాడు, కేరళంలో ముఖ్యమంత్రుల వెనుకంజ..
Assembly Election Results 2026

గత నెలలో జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఓ షాకింగ్ ట్రెండ్ కనబడుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళంలో ముఖ్యమంత్రులు వెనుకంజలో ఉండడం షాక్ కలిగిస్తోంది. ఆయా పార్టీలను ఎన్నో ఏళ్లుగా నడిపిస్తున్న ఈ ముగ్గురు నాయకులకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి (CMs Trailing).


పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్‌తో పాటు నందిగ్రామ్ నియోజకవర్గంలో కూడా పోటీ చేసిన సువేందు.. రెండో చోట్లా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బెంగాల్‌లో బీజేపీ 181 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ 110 సీట్లలో లీడింగ్‌లో ఉంది (Assembly Election Results 2026 LIVE).


మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎదురీదుతున్నారు. కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్ ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారు. స్టాలిన్ కంటే టీవీకే పార్టీకి చెందిన వీఎస్ బాబు 1234 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులో టీవీకే 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏడీఎంకే 78 సీట్లలోనూ, డీఎంకే 48 స్థానాల్లోనూ లీడింగ్‌లో ఉన్నాయి (Live Vote Counting 2026).


మరోవైపు కేరళం సీఎం పినరయి విజయన్ కూడా వెనుకంజలో ఉన్నారు (Election Results 2026 today). ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వీపీ అబ్దుల్ రషీద్ 2812 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 85 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎల్డీఎఫ్ 42 సీట్లలో లీడింగ్‌లో ఉంది.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


కాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు..

Updated Date - May 04 , 2026 | 12:48 PM