కాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు..
ABN , Publish Date - May 04 , 2026 | 06:58 AM
దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం మరికాసేపట్లో మొదలు కాబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగాయి.
దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం మరికాసేపట్లో మొదలు కాబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది (Election Results 2026).
ఈ ఎన్నికలు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనా వీటి ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది (West Bengal Assembly Elections 2026). కాగా, ఇప్పటికే సన్నాహక కౌంటింగ్ కసరత్తును పూర్తి చేయడంతో పాటు ఎలాంటి అవకతవకలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన.. తాజా డిమాండ్లు ఏంటంటే...
హెజ్‌బొల్లాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 50 కీలక స్థావరాలు ధ్వంసం