అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన.. తాజా డిమాండ్లు ఏంటంటే....
ABN , Publish Date - May 03 , 2026 | 09:13 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు ఇరాన్ 14 పాయింట్లతో కూడిన ఓ ప్రతిపాదనను తాజాగా పంపింది. పాకిస్థాన్ ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు పంపించినట్టు తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు ఇరాన్ 14 పాయింట్లతో కూడిన ఓ ప్రతిపాదనను తాజాగా పంపింది. పాకిస్థాన్ ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు పంపించినట్టు తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది. ఈ ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు (Trump Iran plan).
యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌కు అమెరికా 9 పాయింట్లతో ఓ ప్రతిపాదనను పంపించింది. దానికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా అమెరికాకు 14 పాయింట్లతో కూడిన ప్రతిపాదనను పంపించింది. లెబనాన్‌పై దాడులతో సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని ముగించాలని, తమపై మళ్లీ దాడులు చేయకుండా భదత్రా హామీలు ఇవ్వాలని, సరిహద్దు ప్రాంతాల నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవాలని, వివిధ దేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, యుద్ధం వల్ల సంభవించిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ కోరింది (Iran US war updates).
కాగా, ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను త్వరలోనే తాను సమీక్షిస్తానని ట్రంప్ తన సోషల్ మీడియా 'ట్రూత్' ద్వారా వెల్లడించారు (Israel Lebanon strikes). అయితే గత 47 ఏళ్లుగా ప్రపంచానికి, మానవాళికి కలిగించిన నష్టానికి ఇరాన్ ఇంకా తగిన మూల్యం చెల్లించుకోలేదన్నారు. కాబట్టి ఈ ప్రణాళిక తాను ఆమోదించే విధంగా ఉంటుందని అనుకోవడం లేదన్నారు. కాగా, ఈ ప్రతిపాదనలపై అమెరికా స్పందన గురించి ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..