డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..
ABN , Publish Date - May 03 , 2026 | 07:59 AM
నెదర్లాండ్స్‌లో డచ్ రాజ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని పన్నిన భయానక కుట్రలో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సింహాసన వారసురాలు క్యాథరీనా అమాలియా, ఆమె చెల్లెలు యువరాణి అలెక్సియాలను హత్య చేసేందుకు ఓ వ్యక్తి ప్రణాళిక రచించాడు.
నెదర్లాండ్స్‌లో డచ్ రాజ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని పన్నిన భయానక కుట్రలో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సింహాసన వారసురాలు క్యాథరీనా అమాలియా, ఆమె చెల్లెలు యువరాణి అలెక్సియాలను హత్య చేసేందుకు ఓ వ్యక్తి ప్రణాళిక రచించాడు. 33 ఏళ్ల ఆ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఫిబ్రవరిలోనే జరిగినప్పటికీ, విచారణలో భాగంగా కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి (Dutch princesses).
హేగ్‌లో నివసిస్తున్న ఆ అనుమానితుడు నాజీ భావజాలంతో ఈ హత్యలకు కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి పోలీసులు రెండు గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై 'అలెక్సియా', 'మొస్సాద్', 'సీగ్ హైల్' వంటి నాజీ నినాదాలు ఉన్నాయి. అలాగే అతడి దగ్గర ఉన్న ఓ పేపర్‌పై 'అమాలియా', 'అలెక్సియా', 'బ్లడ్‌బాత్' వంటి పదాలు రాసి ఉన్నాయి. అతడు ఒక పెద్ద హింసాత్మక దాడికి సిద్ధమయ్యాడనే విషయాన్ని ఈ ఆధారాలు వెల్లడిస్తున్నాయి (Dutch royal family threat).

పోలీసులు ఇప్పటివరకు ఈ కుట్ర వెనుక అసలు ఉద్దేశ్యాన్ని స్పష్టంగా వెల్లడించకపోయినా, డచ్ రాజ కుటుంబాన్ని ఒక వ్యక్తి నేరుగా లక్ష్యంగా చేసుకోవడం మాత్రం అలజడి రేపుతోంది. డచ్ సింహాసనానికి అమాలియా వారసురాలు కాగా, అలెక్సియా ఆమె తర్వాతి స్థానంలో ఉన్నారు. అమాలియాకు గతంలో కూడా ఇలాంటి భద్రతా పరమైన సమస్యలు ఎదురయ్యాయి. 2020లో ఆమెను చంపేస్తామంటూ హింసాత్మక బెదిరింపులు వచ్చాయి. 2022లో డ్రగ్ గ్యాంగ్‌ల నుంచి కిడ్నాప్ ముప్పు ఉన్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది (Nazi attack Netherlands).
కుట్ర నేపథ్యంలో భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తమైంది. రాజ కుటుంబ సభ్యుల రక్షణకు అదనపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ, రాజకుటుంబ సభ్యులు 'కింగ్స్ డే' వేడుకల్లో పాల్గొని ప్రజలతో అనుబంధాన్ని కొనసాగించారు.
ఇవి కూడా చదవండి..
200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా
అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే