సెమీఫైనల్లో భారత్ ఓటమి.. థామస్ కప్‌లో కాంస్యమే..
ABN , Publish Date - May 03 , 2026 | 08:38 AM
డెన్మార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక థామస్ కప్-2026 సెమీఫైనల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మరోసారి ఫైనల్ చేరాలనే భారత్ అశలు ఫలించలేదు. ఫ్రాన్స్‌తో జరిగిన కీలక పోరులో భారత్ 0-3 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి కారణంగా భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
డెన్మార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక థామస్ కప్-2026 సెమీఫైనల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మరోసారి ఫైనల్ చేరాలనే భారత్ అశలు ఫలించలేదు. ఫ్రాన్స్‌తో జరిగిన కీలక పోరులో భారత్ 0-3 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి కారణంగా భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సెమీఫైనల్ ముందు వరకూ అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు, ఈ మ్యాచ్‌లో మాత్రం ఫ్రాన్స్ ముందు తేలిపోయింది (India vs France Thomas Cup 2026).
స్టార్ ఆటగాడు లక్ష్య సేన్‌కు గాయం కావడం భారత్ అవకాశాలను దెబ్బతీసింది. మరో స్టార్ షట్లర్ ఆయుష్ శెట్టి నిరాశపరిచాడు. మొదటి మ్యాచ్‌లో ఆయుష్ ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పోపోవ్ చేతిలో 11-21, 9-21 తేడాతో ఓడిపోయాడు. తర్వాతి మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ బాగా పోటీ ఇచ్చినప్పటికీ, అలెక్స్ లానియర్‌పై 16-21, 18-21తో పరాజయం పాలయ్యాడు. ఇక, మూడో మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా టోమా జూనియర్ పోపోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో మ్యాచ్ ఫ్రాన్స్ ఖాతాలోకి వెళ్లిపోయింది (Thomas Cup semifinal result).
భారత జట్టుకు ప్రధాన బలం అయిన లక్ష్య సేన్ గాయం (Lakshya Sen injury) కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమవ్వడం పెద్ద ఎదురుదెబ్బ. అతడి స్థానంలో మార్పులు చేయాల్సి రావడంతో జట్టు సమతుల్యత దెబ్బతింది. 2022లో ఈ టోర్నీ విజేతగా నిలిచిన భారత్ ఈ సారి కూడా టైటిల్ ఆశలతో బరిలోకి దిగింది. అయితే సెమీఫైనల్ దశలోనే ఆగిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..